Monday, December 23, 2024

ఉమెన్స్ వరల్డ్ కప్: భారత్ బౌలింగ్.. రెండు వికెట్లు కోల్పోయిన కివీస్

- Advertisement -
- Advertisement -

Women's ODI WC: NZ W lost 2 wickets against IND W

హమిల్టన్‌ః ఐసిసి ఉమెన్స్ వన్డే ప్రపంచ కప్ 2022లో భాగంగా భారత్ తన రెండో మ్యాచ్‌ను ఆథిత్య జట్టు న్యూజిలాండ్ జట్టుతో తలపడుతోంది. కొద్దిసేపటిక్రితమే ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టుకు ఆదిలో ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సుజీ బాట్స్(5) రన్ ఔట్ అయ్యింది. దీంతో 9పరుగులకే కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత జట్టు స్కోరు 54పరుగుల వద్ద రెండో వికెట్ రూపంలో మరో ఓపెనర్ సోఫి(35) పెవిలియన్ చేరింది. అనంతరం క్రీజులోకి వచ్చిన అమితో కలిసి అమెలియా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే భాద్యతను తీసుకుంది. ఇద్దరు మరో వికెట్ పడకుండా నిలకడగా ఆడుతున్నారు. దీంతో కివీస్ 15 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో అమెలియా(29), అమి(5)లు ఉన్నారు.

Women’s ODI WC: NZ W lost 2 wickets against IND W

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News