ఆక్లాండ్: వచ్చే ఏడాది న్యూజిలాండ్ వేదికగా జరిగే మహిళల వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. మార్చి 4న ఆతిథ్య న్యూజిలాండ్ ఆరంభ మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది. ఇక భారత్ తన మొదటి మ్యాచ్‌ను మార్చి ఆరున పాకిస్థాన్‌తో ఆడనుంది. ఇక మార్చి 4న ఆరంభమయ్యే వరల్డ్‌కప్ ఏప్రిల్ 3న జరిగే ఫైనల్‌తో ముగుస్తోంది. ప్రపంచకప్‌లో భాగంగా మొత్తం 31 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో 17 మ్యాచ్‌లు డేనైట్ ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. న్యూజిలాండ్‌లోని ఆరు వేదికల్లో మహిళల వరల్డ్‌కప్ జరుగనుంది. ఆక్లాండ్, తౌరంగా, హామిల్టన్, వెల్లింగ్టన్, క్రిస్ట్‌చర్చ్, డునెడిన్‌లు పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మరోవైపు వరల్డ్‌కప్ 31 రోజుల పాటు జరుగనుంది. ఇదిలావుండగా ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు తలపడుతున్నాయి. ప్రతి జట్టు లీగ్ దశలో ప్రత్యర్థి ఒక్కొ మ్యాచ్ ఆడనుంది. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచే నాలుగు జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. తొలి సెమీఫైనల్ మార్చి 30న, రెండో సెమీస్ మార్చి 31న జరుగుతాయి. ఇక ఫైనల్ సమరం ఏప్రిల్ మూడున జరుగుతుంది. మరోవైపు భారత్ మార్చి 10న పాకిస్థాన్‌తో, మార్చి 12న విండీస్‌తో, మార్చి 16న ఇంగ్లండ్‌తో, మార్చి 16న ఆస్ట్రేలియాతో, మార్చి 22న బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఇక టీమిండియా తన చివరి లీగ్ మ్యాచ్‌ను మార్చి 28న సౌతాఫ్రికాతో ఆడుతుంది.
Women’s ODI World Cup 2022 Schedule Released