Monday, December 23, 2024

మహిళల శక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహిళల శక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని, మహిళ లేనిదే ప్రపంచం లేదని, తల్లి, చెల్లి, బిడ్డ, భార్య ఎటు చూసినా మహిళలేనని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం ఎన్టీఆర్ భవన్‌లో తెలుగు మహిళా విభాగం రాష్ట్ర కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుమహిళా రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి అధ్యక్షత వహించారు. ముందుగా పార్టీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ ముందు ఇంటి పనులు పూర్తి చేసుకుని తర్వాత పార్టీ కోసం పని చేయాలని ఆయన సూచించారు. ఎన్టీఆర్‌కు మహిళల పట్ల ఉన్న గౌరవానికి సంకేతంగా జెండాలో పసుపును తీసుకొచ్చారని, స్తబ్ధతగా ఉన్న టిడిపిని మేల్కొల్పాలంటే మహిళలు ప్రధాన పాత్ర వహించాలి ఆయన సూచించారు. అందులో భాగంగా టిడిపి చేపట్టిన ఇంటింటికీ టిడిపి కార్యక్రమంలో మహిళలు కీలక పాత్ర పోషించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో పొలిట్‌బ్యూరో సభ్యుడు, రావుల చంద్రశేఖర్ రెడ్డి, జాతీయ పార్టీ అధికార ప్రతినిధి, టి.జ్యోత్స్న, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు,మాజీ ఎమ్మెల్యే, కాట్రగడ్డ ప్రసూన, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డి పద్మావతి, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవరలత, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి లీలాపద్మ, జక్కిలి ఐలయ్య యాదవ్, అజ్మీరా రాజునాయక్, నెల్లూరు దుర్గాప్రసాద్, మీడియా వ్యవహారాల కో-ఆర్డినేటర్ బియ్యని సురేష్‌లు పాల్గొన్నారు.

టిటిడిపి సాంస్కృతిక విభాగం పదవీ ప్రమాణం
ఎన్టీఆర్ భవన్‌లో తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పలపల్లి చంద్రహాసన్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News