Monday, December 23, 2024

ఇప్పటికైతే మహిళకు 15 శాతమే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఇన్నేళ్లుగా దేశ పార్లమెంట్‌లో మహిళ ప్రాతినిధ్యం దిగదుడుపుగానే ఉంటూ వచ్చింది. లోక్‌సభలో మహిళ ప్రాతినిధ్యం 1970 వరకూ కేవలం 5 శాతంంగా ఉంది. ఇది 2009 నాటికి రెండంకెల శాతం స్థాయికి చేరింది. మొత్తం సభ్యుల సంఖ్యతో పోలిస్తే లోక్‌సభలో 2019 ఎన్నికల ఫలితాలను బట్టిచూస్తే దాదాపుగా 15 శాతానికి చేరింది. ఇక ఎగువ సభలో ఇది 13 శాతంగా ఉంది.

1951లో లోక్‌సభలో మహిళా ప్రాతినిధ్యం 5 శాతం. తరువాత 1957లో ఇదే స్థాయిలో ఉంది. 1962, 1967లలో ఇది 6 శాతం అయింది. కాగా 1971లో 5, 77లో 4, 80లో 5 శాతం అయింది. తరువాత 1984లో మహిళా శాతం 8 కు చేరింది. 1989లో ఇది 6కు, 1991లో ఏడుకు, 96లో 7కు, 98లో 8 శాతానికి చేరింది. 99లో ఇది 9 శాతానికి వచ్చింది. 2004లో పడిపోయి 8 శాతానికి చేరింది.2009లో మహిళా సీట్లు 11 శాతానికి చేరాయి. 2014లో ఇది 12 శాతానికి చేరింది.

కాగా ఎగువసభ రాజ్యసభలో మహిళల ప్రాతినిధ్యంం 6.9 శాతంగా ఉంది. 2020లో దీని శాతం 10.2 శాతంగా నిలిచింది. ఇక రాష్ట్రాల అసెంబ్లీలు విధాన సభలలో మహిళల ప్రాతినిధ్యం సగటున చూస్తే మరీ తక్కువగా ఉందని వెల్లడైంది. ఇది సగటున 10 శాతం కన్నా తక్కువగా నిలిచింది. ఇక రాష్ట్రాల వారిగా ఎంపిలు, ఎమ్మెల్యేలుగా ఉన్న మహిళల సంఖ్యలో తేడాలు ఉన్నాయి. పార్టీలను బట్టి కూడా మహిళలకు టిక్కెట్లు ఇవ్వడంతో వేర్వేరు వైఖరి ప్రదర్శించారు. ప్రస్తుత 17వ లోక్‌సభలో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ల నుంచి ఎక్కువ మంది మహిళా ఎంపిలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News