- Advertisement -
న్యూఢిల్లీ: ప్రముఖ మహిళా హక్కుల కార్యకర్త, కవయిత్రి,రచయిత్రి కమలా భాసిన్ శనివారం క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశారు. ఆమె వయస్సు 75 సంవత్సరాలు. భారత్‌తోపాటు ఇతర దక్షిణాసియా దేశాలలో మహిళా హక్కుల ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన భాసిన్ నగరంలోని ఒక ఆసుపత్రిలో శనివారం తెల్లవారుజామున 3 గంటలకు తుది శ్వాస విడిచినట్లు మహిళా హక్కుల కార్యకర్త కవితా శ్రీవాస్తవ ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా నిరసన వేదికలపై ప్రతిధ్వనించే ఆజాది నినాదాన్ని పితృస్వామ్యానికి వ్యతిరేకంగా మహిళల హక్కుల కోసం భాసిన్ ఎలుగెత్తి చాటారు. భాసిన్ మరణానికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్, సామాజిక కార్యకర్త హర్ష్ మందర్, కాంగ్రెస్ ఎంపి శశి థరూర్ తదితరులు భాసిన్‌కు నివాళులర్పించారు.
- Advertisement -