Monday, December 23, 2024

టి20 ప్రపంచకప్‌ 2024: మధ్యాహ్నం పాక్‌తో భారత్ ఢీ

- Advertisement -
- Advertisement -

దుబాయి: టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జరిగే గ్రూప్‌ఎ మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ టీమ్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయం పాలైన టీమిండియాకు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది.

మరోవైపు శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన పాకిస్థాన్ ఈ పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. భారత్‌పై మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఉంది. కివీస్‌తో జరిగిన పోరులో బ్యాటింగ్ వైఫల్యం భారత్‌ను వెంటాడింది. మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్, రిచా ఘోష్, షఫాలీ, జెమీమా తదితరులు ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా వీరు మెరుగైన ఆటను కనబరచాల్సి ఉంది. మంధాన, షఫాలీ, హర్మన్, జెమీమాలపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. వీరు రాణిస్తేనే జట్టుకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News