Monday, January 20, 2025

మహిళల టి20 ప్రపంచకప్: రెండో సెమీఫైనల్ లో ఇంగ్లండ్-సౌతాఫ్రికా ఢీ..

- Advertisement -
- Advertisement -

కేప్‌టౌన్: వరుస విజయాలతో జోరుమీదున్న ఇంగ్లండ్ శుక్రవారం సౌతాఫ్రికాతో టి20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్ సమరానికి సమరోత్సాహంతో సిద్ధమైంది. లీగ్ దశలో అజేయంగా నిలిచిన ఇంగ్లండ్ సెమీస్‌లో కూడా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. సౌతాఫ్రికాతో పోల్చితే ఇంగ్లండ్ అన్ని విభాగాల్లో చాలా బలంగా ఉంది. సెమీస్‌కు చేరే క్రమంలో ఇంగ్లండ్ బలమైన భారత్, వెస్టిండీస్, పాకిస్థాన్ జట్లను అలవకోగా ఓడించింది.

సెమీస్‌లో కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. డానియల్ వ్యాట్, డంక్లి, అలి సే కాప్సె, షివర్ బ్రంట్, అమీ జోన్స్, కెప్టెన్ హీథర్ నైట్ తదితరులతో ఇంగ్లండ్ బ్యాటింగ్ చాలా బలంగా ఉన్న విషయం తెలిసిందే. అంతేగాక పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఏకంగా 213 పరుగుల రికార్డు స్కోరును సాధించింది. ఈ సారి కూడా భారీ స్కో రుపై కన్నేసింది. మరోవై పు సౌతాఫ్రికాలో కూడా ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. దీంతో ఇంగ్లండ్‌కు గట్టి పోటీ ఎదురైనా ఆశ్చర్యం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News