భారత్ జైత్రయాత్ర
విండీస్‌పై 6వికెట్ల తేడాతో ఘనవిజయం
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దీప్తీశర్మ
కేప్‌టౌన్: మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుచేసిన టీమిండియా రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. బుధవారం గ్రూప్‌బిలో భాగంగా కేప్‌టౌన్ వేదికగా విండీస్ జట్లు తలపడ్డాయి. భారత జట్టు 6 వికెట్లు తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. వెస్టిండీస్ నిర్దేశించిన విజయలక్ష్యాన్ని సేన 18.1ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది.
తిప్పేసిన దీప్తీశర్మ
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ హేలీ మాథ్యూస్ (2) జట్టును ఆదుకోవడంలో విఫలమైనా మరో ఓపెనర్ ఎస్ టేలర్ 40బంతుల్లో 6ఫోర్లుతో 42పరుగులు చేసి టాప్‌స్కోరర్‌గా నిలిచింది. టేలర్‌కు తోడు 36బంతుల్లో 3ఫోర్లుతో 30పరుగులు చేసి సహకరించింది. మిగిలిన బ్యాటర్లు స్వల్పస్కోరుకే వెనుదిరిగారు. భారత బౌలర్లలో ప్రధానంగా ఆఫ్ స్పిన్నర్ దీప్తీశర్మ బ్యాటర్లను కట్టడి చేసింది. నాలుగు ఓవర్లలో 15పరుగులిచ్చిన దీప్తీ కీలక 3వికెట్లను పడగొట్టింది. మొత్తంమీద వెస్టిండీస్ నిర్ణీత 20ఓవర్లలో 6వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. భారత దీప్తీ 3వికెట్లు, రేణుకాసింగ్, పూజా వస్త్రాకర్ చెరో వికెట్ పడగొట్టారు.
రిచాఘోష్ మెరుపులు
వెస్టిండీస్ నిర్దేశించిన పరుగుల లక్ష ఛేదనలో తొలుత భారత్ తడబాటుకు గురైంది. ఈ మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది. షెఫాలీవర్మ శైలిలో 23బంతుల్లో 5బౌండరీలతో 28పరుగులుచేసి వెనుదిరిగింది. తొలి మ్యాచ్‌లో హాఫ్‌సెంచరీతో అలరించిన రోడ్రిగ్స్ నిరాశ పరిచింది. దీంతో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వికెట్‌కీపర్ రిచాఘోష్ భారత ఇన్నింగ్స్‌ను ఆదుకున్నారు. కెప్టెన్ కౌర్ 42బంతుల్లో 3ఫోర్లుతో 33పరుగులు చేసి ఔటైంది. ఇక, 32బంతుల్లో 5ఫోర్లు 44పరుగులు చేసిన రిచాఘోష్ బౌండరీతో జట్టును గెలిపించింది. మొత్తం మీద భారత జట్టు 18.1 ఓవర్లలోనే 119పరుగులు చేసి 6వికెట్ల తేడాతో విజయం సాధించింది.