Sunday, November 24, 2024

ఇవాళ్లి నుంచి మహిళల టీ20 ప్రపంచకప్.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

- Advertisement -
- Advertisement -

మహిళల టీ20 ప్రపంచకప్ తొమ్మిదో ఎడిషన్ గురువారం(అక్టోబర్ 3) ప్రారంభం కానుంది. యూఏఈ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పోటీ పడుతున్నాయి. ఈరోజు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. మొదట బంగ్లాదేశ్,స్కాట్లాండ్‌ జట్లు తలపడనున్నాయి. షార్జాలోని షార్జా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. ఇక, రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఇక, గ్రూప్ ఎ ఉన్న టీమిండియా తన తొలి మ్యాచ్ ను న్యూజిలాండ్ ఆడనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో అక్టోబర్ 4 భారత్ ఢీకొనబోతోంది. ఆ తర్వాత అక్టోబర్ 6న దయాది దేశం పాకిస్థాన్ జట్టుతో భారత్ ఢీకొట్టనుంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

కాగా, 10 జట్లను ఐదు జట్ల చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు అక్టోబర్ 20న దుబాయ్‌లో జరిగే సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. ఇప్పటివరకు ఆరుసార్లు టి20 ప్రపంచ కప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. అలిస్సా హీలీ నేతృత్వంలోని జట్టు రికార్డు స్థాయిలో ఏడవసారి ట్రోఫీని కైవసం చేసుకునేందుకు బరిలోకి దిగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News