Sunday, December 22, 2024

మహిళల టి20 ప్రపంచకప్ ఫైనల్ : బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

- Advertisement -
- Advertisement -

కేప్‌టౌన్: మహిళల టి20 ప్రపంచకప్ తుది సమరానికి సర్వం సిద్ధమైంది. కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ స్టేడియంలో జరిగే ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో సౌతాఫ్రికా తలపడనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ ల్యానింగ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా ఇప్పటికే ఐదు సార్లు టి20 వరల్డ్‌కప్ ట్రోఫీలను గెలుచుకుంది. తాజాగా ఈసారి కూడా డబుల్ హ్యాట్రిక్ నమోదు చేయాలని తహతహలాడుతోంది. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు తొలిసారి ప్రపంచకప్ ఫైనల్‌కు అర్హత సాధించింది.

జట్ల వివరాలు:

ఆస్ట్రేలియా: అలీసా హీలీ, బెథ్ మూనీ, మెగ్ లానింగ్ (కెప్టెన్), అష్లే గార్డ్‌నర్, గ్రేస్ హారిస్, ఎలిసే పేరి, తహిలా మెక్‌గ్రాత్, జార్జియా వెరెహామ్, జెస్ జొనాసెన్, మెగాన్ షుట్, డార్సి బ్రౌన్, సదర్లాండ్, అలనా కింగ్, హీథర్ గ్రాహమ్, కిమ్ గార్థ్.

సౌతాఫ్రికా: లౌరా వల్‌వర్డ్, తజ్మిన్ బ్రిట్స్, మరిజానె కాప్, చోల్ ట్రియాన్, నడైన్ డి క్లార్క్, సునె లూస్ (కెప్టెన్), అన్నెకా బోస్చ్, సినాలో జఫ్లా, షబ్నమ్ ఇస్మాయిల్, అయబొంగా ఖాకా, నాన్‌కులులెకో, మసబతా క్లాస్, లారా గుడాలి, డెల్మి టక్కర్, అన్నెరి డెర్క్‌సెన్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News