Sunday, January 19, 2025

10నుంచి మహిళల టి20 వరల్డ్‌కప్

- Advertisement -
- Advertisement -

కేప్‌టౌన్: ఐసిసి ప్రపంచకప్ సమరానికి మరో ఐదురోజుల్లో తెర లేవనుంది. దక్షిణాఫ్రికా వేదికగా ఈ నెల 10 ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీలో పదిజట్లు ప్రపంచ టైటిల్ కోసం హోరాహోరీగా పోరాడనున్నాయి. పది జట్లు రెండు గ్రూపులుగా రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో మ్యాచ్‌లు ఆడతాయి. భారత్ పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉండటం అభిమానుల్లో ఆసక్తి రేకేత్తిస్తోంది. భారత్, పాకిస్థాన్‌తోపాటు గ్రూప్ 2లో ఇంగ్లండ్, వెస్టిండీస్, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి. మెగాటోర్నీలో భారత జట్లు తొలి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఫిబ్రవరి 12 ఆదివారం తలపడనుంది. రెండో మ్యాచ్ వెస్టిండీస్‌తో, మూడో మ్యాచ్ ఇంగ్లాండ్‌తో, ఫిబ్రవరి ఐర్లాండ్‌తో భారతజట్టు చివరి లీగ్ మ్యాచ్‌లో తలపడనుంది. టీమిండియాలో తెలుగు అమ్మాయి అంజలి శర్వాణి చోటు దక్కించుకుంది. కాగా ఇటీవల ఐసిసి నిర్వహించిన తొలి అండర్ 19 ప్రపంచకప్ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టును చిత్తు చేసి అండర్ 19 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది.

మహిళల టి20 వరల్డ్ కప్‌కు కూడా దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇవ్వనుంది. భారత యువ జట్టును విజయపథంలో నడిపించిన ధనాధన్ షెఫాలీవర్మ పొట్టికప్‌లో తలపడే సీనియర్ జట్టులో చేరింది. ఐసిసి 8వ టి20 ప్రపంచకప్ ఫిబ్రవరి 10 నుంచి ఆరంభం కానుందని క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. శ్రీలంక నుంచి ఆతిథ్య బాధ్యతలు దక్షిణాఫ్రికా స్వీకరించింది. ప్రపంచకప్ సెమీఫైనల్స్ మ్యాచ్‌లు కేప్‌టౌన్ వేదికగా జరగనున్నాయి. ఇతర లీగ్ మ్యాచ్‌లు పార్ల్, జెబెర్హా, కేప్‌టౌన్‌లో జరగనున్నాయి. ఫిబ్రవరి మ్యాచ్ జరగనుంది. టైటిల్ పోరుకు అంతరాయం ఏర్పడితే 27న రిజర్వు డేగా ప్రకటించారు. కాగా తొలిమ్యాచ్‌లో ఫిబ్రవరి ఆతిథ్య జట్లు శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. నాకౌట్ మ్యాచ్‌లను కేప్‌టౌన్‌లో నిర్వహించనున్నట్లు ఐసిసి వెల్లడించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా గ్రూప్1లో ఉంది.

గూప్1: ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక.

గ్రూప్2: పాకిస్థాన్, ఇంగ్లాండ్, ఐర్లాండ్, వెస్టిండీస్.

పొట్టి ప్రపంచకప్‌లో భారత్ ఆడే మ్యాచ్‌లు

ఐసిసి టి20 ప్రపంచకప్ 2023లో భారత్ వేట దాయాది పాకిస్థాన్‌తో మొదలుపెట్టనుంది. ఫిబ్రవరి 12న కేప్‌టౌన్ వేదికగా సాయంత్రం 6.30కు పాక్‌తో భారత్ తలపడనుంది. అనంతరం ఇదే వేదికగా వెస్టిండీస్ జట్టుతో ఆడనుంది. ఈ మ్యాచ్ కూడా సాయంత్రం 6.30కు ప్రారంభంకానుంది. ఫిబ్రవరి సాయంత్రం 6.30కు భారత్, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జెబెర్హా వేదికగా జరగనుంది. ఆ తర్వాత 20వ తేదీన ఐర్లాండ్‌తో జెబెర్హా వేదికగా ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు కూడా సాయంత్రం 6.30కు జరగనున్నాయి. 23న తొలి సెమీఫైనల్, 24న రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లు జరగనుండగా ఫైనల్ మ్యాచ్ 26వ తేదీ కేప్‌టౌన్ వేదికగా సాయంత్రం 6.30న జరగనుంది.

భారతజట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, భాటియా రిచాఘోష్ (వికెట్‌కీపర్), జెమీమా రోడ్రిగ్స్, డియోల్, దీప్తీ శర్మ, దేవికా వైద్య, రేణుక ఠాకూర్, అంజలి శర్వాణి, వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖాపాండే.
రిజర్వ్ ప్లేయర్స్: మేఘన, సింగ్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News