Saturday, April 5, 2025

మహిళల టి20 ప్రపంచకప్: నేడు పాక్‌తో భారత్ ఢీ..

- Advertisement -
- Advertisement -

కేప్‌టౌన్: ఐసిసి మహిళల టి20ప్రపంచకప్‌లో దాయాదులు భారత్, పాకిస్థాన్‌లు తలపడనున్నాయి. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహిస్తుండగా కెప్టెన్ స్మృతి మంధాన మ్యాచ్‌కు దూరమైంది. ఆసీస్‌తో జరిగిన వార్మప్ ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడింది. వేలిగాయం నుంచి ఆమె కోలుకోలేదని హృషికేశ్ కనిత్కర్ విలేఖరుల సమావేశంలో తెలిపారు. విండీస్, దక్షిణాఫ్రికా ముక్కోణపు సిరీస్‌లో గాయపడిన హర్మన్‌ప్రీత్ కౌర్ పూర్తిగా కోలుకుందని మాజీ క్రికెటర్ కనిత్కర్ తెలిపారు.

ప్రపంచకప్ గ్రూప్ బిలో ఉన్న పాకిస్థాన్, వెస్టిండీస్, ఐర్లాండ్ ఉన్నాయి. ముందు టీమిండియా సిరీస్ ఫైనల్లో సఫారీజట్టుపై ఓటమిపాలైంది. అనంతరంప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో ఓడినా పుంజుకుని బంగ్లాదేశ్‌పై గెలుపొందింది. నేడు ప్రపంచకప్‌లో పాక్‌తో కౌర్‌సేన తలపడనుంది. భారతజట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News