Monday, January 27, 2025

టీమిండియా జైత్రయాత్ర

- Advertisement -
- Advertisement -

భారత అమ్మాయిలకు నాలుగో విజయం
టి20 అండర్-19 ప్రపంచకప్
కౌలాలంపూర్: మహిళల అండర్19 టి20 ప్రపంచకప్‌లో భారత్ వరుసగా నాలుగో విజయం సాధించింది. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. భారత బౌలర్లు మరోసారి అద్భుత బౌలింగ్‌తో జట్టును గెలిపించారు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 64 పరుగులు మాత్రమే చేసింది. ఆరంభం నుంచే భారత బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేస్తూ బంగ్లా బ్యాటర్లను కట్టడి చేశారు. వైష్ణవి శర్మ మరోసారి అద్భుత బౌలింగ్‌తో అలరించింది.

పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా వరుస క్రమంలో వికెట్లను తీస్తూ ప్రత్యర్థి టీమ్ బ్యాటర్లను హడలెత్తించింది. వైష్ణవి శర్మ చిరస్మరణీయ బౌలింగ్‌ను కనబరచడంతో బంగ్లాదేశ్ తక్కువ స్కోరుకే పరిమితం కాక తప్పలేదు. భారత బౌలర్లలో వైష్ణవి మూడు, షబ్నమ్, జోషిత,త్రిష తలో వికెట్ పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 7.1 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తెలుగు అమ్మాయి గొంగడి త్రిష అద్భుత బ్యాటింగ్‌తో జట్టును గెలిపించింది. బంగ్లా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న త్రిష 31 బంతుల్లో 8 ఫోర్లతో 40 పరుగులు చేసి టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించింది. సానికా చాల్కే 11(నాటౌట్) తనవంతు పాత్ర పోషించింది. భారత్ తన తర్వాతి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌తో తలపడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News