Friday, December 20, 2024

మహిళల వన్డే ప్రపంచకప్‌: భారత్ స్కోరు 277/7.. దూకుడుగా ఆడుతున్న ఆసీస్

- Advertisement -
- Advertisement -

Women’s WC 2022: IND W Set a target 278 runs against AUS W

ఆక్లాండ్‌: మహిళల వన్డే ప్రపంచకప్‌ 2022లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా మొదటి బ్యాటింగ్ చేపట్టి నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగుల సాధించింది. కెప్టెన్‌ మిథాలీ రాజ్(68)‌, యస్తికా భాత్రా(59), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(57 నాటౌట్)లు అర్థ శతకాలతో మెరవగా.. చివర్లో పూజా వస్త్రకార్‌(34) రాణించింది. అనంతరం భారత్ విధించిన 278 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. ప్రస్తుతం ఆసీస్ 31 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 172 పరుగులు సాధించింది. మెగ్ లన్నింగ్(39), పెర్రి(11)లు క్రీజులో ఉన్నారు.

Women’s WC 2022: IND W Set a target 278 runs against AUS W

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News