Monday, December 23, 2024

మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్షం

- Advertisement -
- Advertisement -
  • తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

తాండూరు: మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్షమని తాండూరు ఎమ్మెల్యే ఫైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని తులసిగార్డెన్‌లో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో బాగంగా మహిళా సంక్షేమ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడు లేని విధంగా మహిళా సంక్షేమానికి సిఎం కేసిఆర్ పెద్ద పీట వేశారన్నారు. అదే విదంగా అంగన్‌వాడి సిబ్బంది ఏర్పాటు చేసిన ఆహార స్టాళ్లను ఎమ్మెల్యే తిలకించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఓ అశోక్‌కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ దీపానర్సింలు, పట్టణ అధ్యక్షులు అప్పు, కౌన్సిలర్ విజయదేవి, నాయకులు , మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News