Monday, January 20, 2025

పూజా వస్త్రాకర్ అర్థశతకం.. ఆరు వికెట్లు కోల్పోయిన భారత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌ లో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ మిథాలీ రాజ్(9), హర్మన్ ప్రీత్ కౌర్(4), రిచా ఘోష్(1) ముగ్గురు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరి నిరాశపర్చారు. దీంతో టీమిండియా 114 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన పూజా వస్త్రాకర్, స్నేహ రానాలు మరో వికెట్ పడకుండా వేగంగా పరుగులు రాబట్టి జట్టును అదుకున్నారు. దీంతో భారత్ 47 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. క్రీజులో పూజా వస్త్రాకర్(55), స్నేహ రానా(43)లు ఉన్నారు.

Women’s World Cup: Pooja Vastrakar hit 50 runs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News