Monday, December 23, 2024

విద్యార్ధుల కోసం హాల్‌ టిక్కెట్‌ ఆఫర్‌ను ప్రకటించిన వండర్‌లా హాలీడేస్‌..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: దేశంలో అతిపెద్ద అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ చైన్‌, వండర్‌లా హాలీడేస్‌ తమ హాల్‌ టిక్కెట్‌ ఆఫర్‌తో తిరిగి వచ్చింది. 2022–23 విద్యా సంవత్సరంలో తమ 10, 11, 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరైన విద్యార్ధులకు అత్యంత ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ఈ ఆఫర్‌లో భాగంగా అందిస్తారు. ఈ డిస్కౌంట్ని వండర్‌లా యొక్క బెంగళూరు, హైదరాబాద్‌, కొచ్చి పార్క్‌ల వద్ద అందిస్తుంది.

తమ ఒరిజినల్హాల్‌టిక్కెట్లను చూపడం ద్వారా విద్యార్ధులు వండర్‌లా పార్క్‌ ప్రవేశ టిక్కెట్ల పై 35% డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్‌ను ఆన్‌లైన్‌ మరియు ఆఫ్‌లైన్‌లో విద్యార్ధులు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. అయితే విద్యార్ధులు తమ ప్రస్తుత సంవత్సర హాల్‌ టిక్కెట్‌ను పార్క్‌ లోపలకు ప్రవేశిస్తున్నప్పుడు ధృవీకరించుకోవాల్సి ఉంటుంది.

సందర్శకులు తమ ప్రవేశ టిక్కెట్లను ముందుగా ఆన్‌లైన్‌ పోర్టల్‌ https://bookings.wonderla.com/ వద్ద బుక్‌ చేసుకోవడాన్ని వండర్‌లా ప్రోత్సహిస్తుంది. వినియోగదారులు నేరుగా తమ టిక్కెట్లను పార్క్‌ కౌంటర్ల వద్ద కూడా కొనుగోలు చేయవచ్చు. మరింత సమాచారం కోసం www.wonderla.com చూడవచ్చు లేదా బెంగళూరులో +91 80372 30333, +91 80350 73966 ; హైదరాబాద్‌లో 0841 4676333, +91 91000 63636 మరియు కొచిలో 04843514001, 7593853107 నెంబర్లకు కాల్‌ చేయవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News