Monday, December 23, 2024

ఆన్‌లైన్ టిక్కెట్‌లపై వండర్ లా స్పెషల్ ఆఫర్‌

- Advertisement -
- Advertisement -

దేశంలోని అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ చైన్, వండర్ లా హాలిడేస్ లిమిటెడ్ జూన్ 18, 2023న ఫాదర్స్ డే పురస్కరించుకుని ఒక ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. వండర్‌లా”2+1″ ఆఫర్‌ను అందజేస్తుంది, తద్వారా మొత్తం కుటుంబానికి చిరస్మరణీయమైన అనుభవాన్ని అందిస్తామనే భరోసా అందిస్తుంది. మూడు టిక్కెట్‌లను కొనుగోలు చేసిన అతిథులు, రెండు టిక్కెట్‌లకు మాత్రమే చెల్లించాలి మరియు మూడవ టిక్కెట్ వారి తండ్రికి పూర్తిగా ఉచితం. బెంగళూరు, హైదరాబాద్ మరియు కొచ్చిలోని వండర్ లా మూడు పార్కులలో ఆన్‌లైన్ టిక్కెట్‌ల కోసం జూన్ 18వ తేదీన మాత్రమే ఈ ప్రత్యేకమైన ఆఫర్ చెల్లుబాటు అవుతుంది.

ఈ సందర్భంగా వండర్ లా హాలిడేస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె. చిట్టిలప్పిల్లి మాట్లాడుతూ.. “తండ్రీ బిడ్డల బంధం మాటల్లో చెప్పలేనంతగా అపూర్వమైన మరియు అసాధారణమైన అనుబంధం. వండర్‌లాలో మేము ఆ బంధాలను గౌరవిస్తూ ఫాదర్స్ డేని జరుపుకోవడానికి సంతోషిస్తున్నాము. ఈ ప్రత్యేక ఆఫర్ తండ్రులు నిస్వార్థంగా ఇచ్చే ప్రేమ, మార్గదర్శకత్వం మరియు మద్దతును మరియు చిరకాల జ్ఞాపకాలను గౌరవిస్తున్న వేళ, ఆ అమూల్యమైన జ్ఞాపకాలను కలిసి స్మరించుకోవడానికి సరైన అవకాశాన్ని అందిస్తుంది…” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News