దేశంలోని అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ చైన్, వండర్ లా హాలిడేస్ లిమిటెడ్, అడ్వెంచర్ కోరుకునే వారందరికీ సంతోషం, సాహసోపేత అనుభవాలను అందించే ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. సందర్శకులు తమ పార్క్ ప్రవేశ టిక్కెట్లపై 25% ఆదా చేసుకునే అద్భుతమైన డీల్స్ తో బుధవారాలు ఇక మరింత సరదాగా మారతాయి. ఈ ఆఫర్ ప్రతి బుధవారం ఒక్కో పార్క్‌కు మొదటి 1000 ఆన్లైన్ టిక్కెట్లపై మాత్రమే అందుబాటులో ఉంటుంది, కాబట్టి మీ టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకోండి.
ఈ పరిమిత కాల కార్యక్రమంలో భాగంగా, ఆన్లైన్ టిక్కెట్ కొనుగోళ్ల పై ఫ్లాట్ 25% తగ్గింపు ప్రత్యేకంగా వర్తిస్తుంది. ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తుంది, సందర్శకులు తమ సందర్శనను ప్లాన్ చేసుకోవడానికి, తమ సౌలభ్యం ప్రకారం టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. వండర్ లా-బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిలోని మూడు పార్కులలో ఆన్లైన్ టిక్కెట్లకు మాత్రమే ఈ ప్రత్యేకమైన ఆఫర్ చెల్లుబాటు అవుతుంది.
దీని గురించి వండర్ లా హాలిడేస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కె. చిట్టిలప్పిల్లి మాట్లాడుతూ.. “ఈ అద్భుతమైన తగ్గింపుతో బుధవారాలు మరింత ఆనందాన్ని తీసుకువస్తాయి, ఈ ఆఫర్ తో ప్రతి ఒక్కరూ ఆనందాన్ని, ఉత్సాహాన్ని సులభంగా అనుభవించగలుగుతారు. ఈ అద్భుతమైన ఆఫర్, మమ్మల్ని అభిమానిస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపే మార్గం మరియు వారికి సాటిలేని ధరతో వండర్ లా లో అద్భుత అనుభవాలను సొంతం చేసుకునే అవకాశాన్ని అందిస్తున్నాము ” అని అన్నారు.