Monday, December 23, 2024

వండర్‌లా హైదరాబాద్‌ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: భారతదేశంలో అతిపెద్ద అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లలో ఒకటైన వండర్‌లా హాలీడేస్‌, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 08 మార్చి 2023న ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ రోజున, ఈ పార్క్‌ను ప్రత్యేకంగా మహిళల కోసం తెరువనున్నారు. మహిళలు తమ స్నేహితులతో కలిసి వినోదం, సాహసంతో కూడిన అద్వితీయ అనుభవాలను సొంతం చేసుకునే వినూత్న అవకాశాన్ని వండర్‌లా అందిస్తుంది. ఈ పార్క్‌లో విస్తృత స్ధాయిలో ప్రపంచ శ్రేణి రైడ్స్‌, ఆకర్షణలను మహిళలు ఆస్వాదించవచ్చు.

మహిళా దినోత్సవ వేళ పార్క్‌ సందర్శనను మరింత ఆసక్తికరంగా మారుస్తూ, వండర్‌లా ఇప్పుడు ఒకటి కొంటే, ఒకటి ఉచితంగా పొందండి ఆఫర్‌ను ఎంట్రీ (ప్రవేశ) టిక్కెట్ల పై అందిస్తుంది. ఈ టిక్కెట్‌ ధర 1199 రూపాయలు (జీఎస్‌టీతో కలిపి). ఈ ఆఫర్‌ ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ బుకింగ్‌ కోసం అందుబాటులో ఉంటుంది. ఇది మొదటి 1000 టిక్కెట్లకు పరిమితం. మహిళల కోసం వినోదాత్మక మరియు సౌకర్యవంతమైన అనుభవాలకు భరోసా అందించడానికి, పార్క్‌ ఆ రోజు పురుష సందర్శకులను మరీ ముఖ్యంగా 10 సంవత్సరాలు దాటిన వారిని మార్చి 08వ తేదీన అనుమతించరు. మార్చి 08 వ తేదీన పార్క్‌ సందర్శన కోసం బుక్‌ చేసుకున్న పురుషుల టిక్కెట్లను క్యాన్సిల్‌ చేయడంతో పాటుగా మహిళలకు మాత్రమే ఆ రోజు ప్రవేశం ఉంటుందనే భరోసా కలిగిస్తున్నారు.

మహిళలు ఇప్పుడు ఒకటి కొనండి మరియు మరొకటి ఉచితంగా పొందండి బఫె ఆఫర్‌ను కేవలం 699 రూపాయలు చెల్లించి పొందవచ్చు. అంతేకాదు, పసందైన రుచులను వారు సగం ధరకే పార్క్‌ వద్ద పొందవచ్చు. ఈ ఆఫర్‌ , పరిమిత కాలం పాటు మొదటి 500 బుకింగ్స్‌ వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుంది. థ్రిల్లింగ్‌ రైడ్స్‌తో పాటుగా వండర్‌లా ఆ రోజు లైవ్‌ డీజె, పోటీలు, ఫుడ్‌ స్టాల్స్‌, మరియు మరెన్నో అందుబాటులో ఉంచడం ద్వారా ఆ రోజును మరింత ఉత్సాహంగా మారుస్తుంది.

ఈ కార్యక్రమం గురించి వండర్‌లా హాలీడేస్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ అరుణ్‌ కె చిట్టిలాపిళ్లి మాట్లాడుతూ ‘‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మార్చి 08వ తేదీన మా పార్క్‌లు అన్నింటి వద్ద ప్రత్యేకంగా మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుందని వెల్లడించేందుకు సంతోషిస్తున్నాను. మహిళలందరికీ ప్రత్యేకమైన, మరుపురాని అనుభవాలను సృష్టించాలన్నది మా లక్ష్యం. ఈ ఆఫర్‌ తో వారు తమ స్నేహితులు, కుటుంబసభ్యులతో వినోదాత్మకంగా గడపగలరని ఆశిస్తున్నాము. అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ల ప్రపంచాన్ని అన్వేషించాలనుకునే మహిళల కోసం వినూత్న అవకాశాలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. ఈ సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా మలుస్తున్నాము. ఈ ఆఫర్‌ తో మా పార్క్‌ల వద్దకు మరింత మంది మహిళలు వచ్చేందుకు అవకాశాలున్నాయి. వారిని స్వాగతించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని అన్నారు.

వండర్‌లా హాలీడేస్‌ వద్ద మహిళా దినోత్సవ ఆఫర్‌, మహిళలు తాము అభిమానించే వారితో కలిసి రావడంతో పాటుగా ఈ ప్రత్యేక సందర్భాన్ని వేడుక చేసుకునే అద్భుత అవకాశం అందిస్తుంది . మీ టిక్కెట్లను ఇప్పుడే బుక్‌ చేసుకోండి. మరుపురాని రీతిలో ఈ రోజును వినోదం, సాహసం, ఉత్సాహవంతంగా వండర్‌లా వద్ద మలుచుకోండి!.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News