Wednesday, January 22, 2025

ప్రేమికుల కోసం ప్రత్యేక ప్యాకేజీలను తీసుకువచ్చిన వండర్‌లా..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌:దేశంలో అతిపెద్ద అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ చైన్‌ సంస్ధ, వండర్‌లా హాలీడేస్‌ ఈ ప్రేమికుల దినోత్సవ వేళ ప్రేమ, సంతోషాన్ని మరింతగా వ్యాప్తి చేస్తూ ప్రత్యేక ప్యాకేజీలను తమ బెంగళూరు, హైదరాబాద్‌, కొచి పార్క్‌ల కోసం తీసుకువచ్చింది. వాలెంటైన్స్‌ వీక్‌ కార్యక్రమాలు 10 ఫిబ్రవరి నుంచి 14 ఫిబ్రవరి 2023 వరకూ జరుగుతాయి. ఈ కార్యక్రమాలు జంటలకు మరుపురాని వినూత్న అనుభవాలను కలిగిస్తూ, కలకాలం నిలిచిపోయే మధురస్మృతులను అందిస్తుంది.

గాలిలో 300 అడుగుల ఎత్తున స్కై వీల్‌పై డైనింగ్‌ చేయడం ద్వారా ప్రేమానుభూతులను జంటలు పంచుకోవడం లేదా వేవ్‌పూల్‌ చెంతన బఫె డిన్నర్‌ ఆస్వాదించడం, రెండూ కూడా హైదరాబాద్‌, కొచి, బెంగళూరులలోని వండర్‌లా పార్క్‌ వద్ద అందుబాటులో ఉంటాయి. స్కై వీల్‌ డైన్‌ అనుభవాల కోసం జంటకు 399 రూపాయలు (జీఎస్‌టీతో కలిపి) చెల్లిస్తే సరిపోతుంది. ఇది ఫిబ్రవరి 10 నుంచి 14 ఫిబ్రవరి 2023 వరకూ అందుబాటులో ఉంటుంది.

అలాగే వేవ్‌ పూల్‌ చెంతన బఫె డిన్నర్‌ కోసం జంటకు 849 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది (జీఎస్‌టీ కలిపి). ఇది 14 ఫిబ్రవరి 2023 న మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ రెండు ప్యాకేజీలూ పార్క్‌ ఎంట్రీ కాంబో ప్యాకేజీలుగా సైతం లభ్యమవుతాయి. పార్క్‌ ప్రవేశం, స్కైవీల్‌ డైన్‌ లేదా పార్క్‌ ప్రవేశం, వేవ్‌ పూల్‌ బఫె డిన్నర్‌ గా లభ్యమవడం ద్వారా ఈ వాలెంటైన్స్‌ డే ను మరుపురానిదిగా, చిరస్మరణీయమైనదిగా మలుచుకోవచ్చు.

ఈ ప్రేమికుల దినోత్సవ వేళ మీ ప్రియమైన వారిపై వండర్‌లా హాలీడేస్‌తో మీ ప్రేమను చూపండి. ఆన్‌లైన్‌ బుకింగ్‌ పోర్టల్‌ ద్వారా ముందుగానే ప్రవేశ టిక్కెట్లను బుక్‌ చేసుకోవడంతో పాటుగా జీవితకాలపు మధురస్మృతులను సృష్టించుకోవడానికి వండర్‌లా ప్రోత్సహిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News