Friday, December 20, 2024

ప్రధానిపై ఇతర దేశస్తుల వ్యాఖ్యలు సహించం

- Advertisement -
- Advertisement -

శరద్ పవార్ హెచ్చరిక

ముంబై: భారత్, మాల్దీవుల మధ్య తలెత్తిన వివాదంపై ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ ప్రధాని నరేంద్ర మోడీకి అండగా నిలబడ్డారు. ప్రధాని మోడీపై మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మన దేశ ప్రధానిపై ఇతర దేశాలకు చెందిన వ్యక్తులు ఎటువంటి వ్యాఖ్యలు చేసిన సహించబోమని ఆయన స్పష్టం చేశారు. ఆయన మన దేశ ప్రధానమంత్రని, ఇతర దేశాలకు చెందిన వ్యక్తులు ఎంతటి పెద్ద పదవిలో ఉన్నప్పటికీ తమ దేశ ప్రధానిపై అటువంటి వ్యాఖ్యలు చేస్తే అనుమతించబోమని మంగళవారం పవార్ తెలిపారు. మన ప్రధానమంత్రి పదవిని మనమంతా గౌరవించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News