Saturday, November 2, 2024

చర్చలకు రైతులు సిద్ధం

- Advertisement -
- Advertisement -

won't allow business over hunger in Country:Tikait

 

n తేదీ సూచించాలని ప్రభుత్వానికి సూచన

n ఆందోళన జీవి
అన్నందుకు అభ్యంతరం
తెలిపిన రైతులు
n ఎంఎస్‌పిపై చట్టం
చేయాల్సిందే : తికాయత్

ఘజియాబాద్: దేశంలో ఆకలితో వ్యాపారం చేయడాన్ని అనుమతించబోమని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ తికాయత్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి) కల్పించేందుకు చట్టాన్ని తీసుకురావాలని ఆయన పునరుద్ఘాటించారు. సోమవారం రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ నూతన వ్యవసాయ చట్టాలను ప్రస్తావిస్తూ ఎంఎస్‌పి గతంలో ఉంది.. ఇప్పుడూ ఉంది..భవిష్యత్తులో కూడా ఉంటుంది అంటూ చేసిన ప్రకటనకు తికాయత్ ఇక్కడ విలేకరుల వద్ద ఆ విధంగా స్పందించారు.

దేశంలో ఆకలితో వ్యాపారం చేయనివ్వబోము. ఆకలి ఎంత ఉంటే పంటల ధరలు కూడా అంతే ఉండాలి. ఆకలితో వ్యాపారం చేసే వారిని ఈ దేశం నుంచి తరిమికొడతాం అంటూ తికాయత్ హెచ్చరించారు. ప్రస్తుతం సాగుతున్న నిరసనల్లో కొత్త వర్గం పుట్టుకొచ్చిందంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది రైతు వర్గమని, దీనికి ప్రజల మద్దతు కూడా ఉందని అన్నారు.

రైతులు ప్రస్తుతం సాగిస్తున్న ఆందోళనలతో దేశంలో ఎంఎస్‌పిపై చట్టం లేదన్న విషయం వెలుగులోకి వచ్చిందని, దీని కారణంగానే రైతుల నుంచి వ్యాపారులు తక్కువ ధరలకు పంటలు కొంటూ లూటీ చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రస్తుత రైతుల ఉద్యమాన్ని కులాలు, ప్రాంతాల ప్రాతిపదికన చీల్చడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆయన ఎండగట్టారు. మొదట్లో ఈ ఉద్యమాన్ని పంజాబ్‌కు చెందిన సమస్యగా చిత్రీకరించడానికి ప్రభుత్వం ప్రయత్నించిందని, ఆ తర్వాత సిక్కుల సమస్యగా, ఆ తర్వాత జాట్ల సమస్యగా.. అలా చిత్రీకరిస్తూ పోతోందని ఆయన ఆరోపించారు. దేశంలోని రైతులంతా సమైక్యంగా ఉన్నారని, పెద్ద రైతు, చిన్న రైతుల అనే తేడా లేదని, ఈ ఉద్యమం రైతులందరికీ చెందినదని తికాయత్ స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటనపై మరో రైతు నాయకుడు, సంయుక్త కిసాన్ మోచ్చ సభ్యుడు అభిమన్యు కోహర్ స్పందిస్తూ ఎంఎస్‌పి ఎక్కడకు వెళ్లదని, అది ఉంటుందని ప్రభుత్వం ఇప్పటికే వందలాది సార్లు చెప్పిందని అన్నారు. ఎంఎస్‌పి ఉంటుందని వాదిస్తున్న ప్రభుత్వం మా పంటలకు కనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన భరోసా ఎందుకు కల్పించడం లేదని ఆయన ప్రశ్నించారు. చర్చలకు రావాలంటూ రైతులకు ప్రధాని ఇచ్చిన ఆహ్వానంపై మాట్లాడుతూ ప్రభుత్వంతో చర్చలకు రైతు సంఘాలు సిద్ధమేనని, అయితే ఆ ఆహ్వానం అధికారిక పద్ధతుల్లో రావాలని ఆయన చెప్పారు.

చర్చలకు సిద్ధం: రైతు నేతలు

న్యూఢిల్లీ : ఆందోళనలు విరమించాలని, చర్చలకు రావాలని ప్రధాని నరేంద్రమోడీ అభ్యర్థనపై తదుపరి చర్చలకు తేదీ నిర్ణయించాల్సిందిగా సోమవారం రైతు సంఘాల నేతలు ప్రభుత్వానికి సూ చించారు. ఆందోళనకారుల్లో ‘ఆందోళన జీవి’ అనే కొత్తతరం దేశంలో పుట్టుకొచ్చిందని ప్రధాని మోడీ రాజ్య సభలో వ్యాఖ్యానించడంపై రైతునేతలు అభ్యంతరం తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఆందోళన అన్నది ముఖ్యమైన పాత్ర వహిస్తుందని పేర్కొన్నారు. ఆందోళన నిర్వహణలో కీలక పాత్ర వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా సీనియర్ సభ్యుడు రైతునేత శివ్‌కుమార్ కక్కా తదుపరి చర్చలకు తా ము సిద్ధంగా ఉన్నామని, ఎప్పుడు ఏతేదీన ఏ సమయంలో చర్చలకు సమావేశం ఏర్పాటు చేస్తారో ప్రభుత్వమే తప్పనిసరిగా చెప్పాలని సూచించారు. ప్రభుత్వంతో చర్చలను తామేనాడు తిరస్కరించలేదని ఎప్పుడైతే చర్చలకు పిలిచేవారో అప్పుడు కేంద్రమంత్రులతో తాము భేటీ అయ్యేవారమని ఆయన వివరించారు.

కిసాన్‌మోర్చా మరో సభ్యు డు అభిమన్యు కొహర్ ప్రభుత్వం వందసార్లు ఎంఎస్‌పి ఎక్కడకీ పోదని, అలాగే ఉంటుందని చెబుతోందని, అలాంటప్పుడు తమ పంటలకు ఎంఎస్‌పి(కనీస మద్దతు ధర)పై చట్టపరమైన గ్యా రంటీ ప్రభుత్వం ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. ఇంతవరకు 11 సార్లు చర్చలు జరిగాయి. అయినా తమ డిమాండ్లపై రైతు సంఘాలు గట్టిగా నిలబడడంతో ప్రతిష్ఠంభన కొనసాగుతోం ది. మూడు వివాదాస్పద చట్టాలను రద్దు చేయ డం, ఎంఎస్‌పికి చట్టపరమైన గ్యారంటీ కల్పించడం రైతుల ప్రధాన డిమాండ్లు. ఆఖరి సారి చర్చల్లో ప్రభుత్వం ఆ చట్టాలను 12 నుంచి 18 నెలలపాటు అమలు చేయకుండా పెండింగ్‌లో ఉంచుతామని చెప్పింది. కానీ రైతు సంఘాలు దానికి ఒప్పుకోవడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News