Friday, November 22, 2024

మీరు మన్నించకుంటే జీవించలేను

- Advertisement -
- Advertisement -

'Won't be able to live without Didi :Sonali Guha

మమతను అభ్యర్థిస్తూ మాజీ ఎంఎల్‌ఎ సొనాలి గుహ లేఖ

కోల్‌కతా : తృణమూల్ కాంగ్రెస్‌లో తిరిగి తనను చేర్చుకోవాలని మాజీ ఎంఎల్‌ఎ సొనాలి గుహ పార్టీ అధ్యక్షురాలు మమతాబెనర్జీని అభ్యర్థించారు. ఈమేరకు శనివారం మమతాబెనర్జీకి లేఖ రాశారు. ఉద్వేగానికి గురైన తరువాత తాను పార్టీని విడిచిపెట్టి బిజెపిలో చేరానని, దీన్ని మన్నించి పార్టీలో చేర్చుకోవాలని ఆమె లేఖలో కోరారు. తనను క్షమించక పోతే తాను జీవించలేనని కూడా ఆమె స్పష్టం చేశారు. నాలుగు సార్లు ఎంఎల్‌ఎగా పదవిని సాధించిన గుహ ఒకనాడు మమతకు నీడగా పేరు పొందారు. ఈసారి ఎన్నికల అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో ఉద్వేగానికి గురై బిజెపిలో చేరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News