Monday, December 23, 2024

బిజెపి పంచన చేరే ప్రసక్తి లేదు : జయంత్ చౌధరి

- Advertisement -
- Advertisement -

Won't change decision says Jayant Chaudhary

లక్నో: ఎప్పటికీ బీజేపీ పంచన చేరే ప్రసక్తి లేదని, ఆ పార్టీతో జట్టుకట్టేది లేదని రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షుడు జయంతి చౌధరి స్పష్టం చేశారు. ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రి అమిత్‌షా కొన్ని రోజుల క్రితం యూపీలో పర్యటిస్తూ జయంత్ చౌదరి తప్పుడు ఇంటిని ఎంచుకున్నారని, బీజేపీలో ఆయనకు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ప్రకటించిన నేపథ్యంలో జయంతి చౌధరి పై వ్యాఖ్యలు చేశారు. జాట్ సామాజిక వర్గాన్ని చల్లబరిచేందుకు అమిత్‌షా ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే నా పార్టీని నా చేతుల తోనే నాశనం చేసుకున్నట్టు అని జయంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి అజిత్ చౌదరిని బీజేపీ తక్కువ చేసి చూపిందని, ఇదో గుణపాఠమని పేర్కొన్నారు. యూపీ రైతులకు ఎంతో చేస్తామని బీజేపీ తెగ వాగ్దానాలు చేసిందని, కానీ చేసిందేమీ లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News