Sunday, December 22, 2024

ప్రాజెక్టులు అప్పగించం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీపై ఉన్న శ్రీశైలం ,నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణానదీయాజమాన్యబోర్డుకు అప్పగించేది లేదని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదలశాఖ స్పష్టం చేసింది. శుక్రవారం జలసౌధలో నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా తొలుత మీడియాతో మాట్లాడారు.కృష్ణానదీ జలాలకు సబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలను తెలియజేస్తూ గత నెల 27న కేంద్రజల్‌శక్తి శాఖకు రాసిన లేఖకు మాత్రమే కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. అందులో ఇప్పటికీ ప్రభుత్వవైఖరిలో ఎటువంటి మార్పులేదన్నారు.నదీజలాల్లో తెలంగాణకు సగం నీటి వాటా రావాల్సిందే అని స్పష్టం చేశారు.

నీటినిర్వహణలో ఆపరేషన్ ప్రోటోకాల్‌పై నిర్ణయం జరగాలని ఆ నిర్ణయం తెలంగాణ రాష్ట్రానికి ఆమోదయోగ్యంగా ఉన్నప్పుడే శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే అంశాలను పరిశీలిస్తామని తెలిపారు. గురువారరం కృష్ణాబోర్డు చైర్మన్ అధ్యక్షతన జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో ప్రాజెక్టుల అప్పగింతకు తెలంగాణ ఇఎన్‌సి అంగీకరించడాన్ని ప్రశ్నించగా ఆ విషయం ఇఎన్‌సి మురళీధర్ వెల్లడిస్తార ని నీటిపారుదల కార్యదర్శి రాహుల్ బొజ్జా పేర్కొన్నారు. అనంతరం అ క్కడి నుంచి రాహుల్ బొజ్జా వెళ్లిపోయారు. తర్వాత ఎలక్ట్రానిక్ మీ డియా ఉన్న హాల్‌లో రాహుల్ బొజ్జా లేకుండా ఇఎన్‌సి మురళీధర్ ప్ర త్యేకంగా మళ్లీ మీడియాతో మాట్లాడారు. కృష్ణానదీజలాల్లో ఉమ్మడి ఏ పికి కేటాయించిన 810టిఎంసీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి 34శాతంగా 299టిఎంసీలు , ఏపికి 66శాతంగా 511టిఎంసీలు వినియోగించుకునేలా గతంలో జరిగిన ఒప్పందాన్నే ఇకపై కూడా కొనసాగిస్తామని ఇఎన్‌సి మురళీధర్ తెలిపారు. ఈ ప్రకారమే నీటిపంపిణీని కృష్ణాబోర్డు పర్యవేక్షిస్తుందని తెలిపారు. అయితే తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదీజలాల్లో 50;50 నిస్పత్తిలో వాటా కావాలని కోరుతోందని కొత్త ట్రిబ్యునల్‌లో నీటి కేటాయింపులు జరిగి, ఏదో ఒకనాటికి అది అమలు కాకపోతుందా అన్న అశమాత్రం ఉందన్నారు.

ప్రతియేటా కృష్ణాలో లభ్యత నీటిలో తెలంగాణ ఎపి మధ్య 34;66 నిష్పత్తిలోనే నీటి కేటాయింపులపై రెండు రాష్ట్రాల అవసరాలకు తగ్గట్టుగా త్రిసభ్య కమిటీలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని ఆ నిర్ణయాలను అమలు చేసే బాధ్యత మాత్రం బోర్డు తీసుకుంటుందని తెలిపారు. ఎపికి కృష్ణాలో కేటాంయించిన 66శాతం నీటిని ఎన్‌బ్లాక్‌గా ఆ రాష్ట్రం తన అవసరాలకు తగ్గట్టుగా ఎక్కడి నుంచైనా వాడుకోవచ్చని తెలిపారు. అయితే బేసిన్ బయటి ప్రాంతాలకు నీటిని వాడుకోవటాన్ని మాత్రం అంగీకరించం అని తెలిపారు. అంతే కాకుండా ఎపిలో అనధికార ప్రాజెక్టులు ఉండరాదని, రాయలసీమ పథకం పనులు కూడా వేగంగా జరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చినందున వాటిని పరిశీలించమని బోర్డును కోరామన్నారు. అంతే కాకుండా తెలంగాణ రాష్ట్ర నీటి అవసరాలు , నీటివాటాలు తదితర అంశాలను అపెక్స్ కౌన్సిల్‌కు రెఫర్ చేయమని కూడా కోరినట్టు తెలిపారు.

సాగర్‌పై సిఆర్‌పిఎఫ్ అనధికార దాడి
రాష్ట్ర నిర్వహణలో ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టుపైన సిఆర్‌పిఎఫ్ బలగాలు అనధికారికంగా దాడి చేశాయని దీన్ని ఉపసంహరించుకోవాలని కోరామన్నారు. మునుపటి స్థితికి తెచ్చి సాగర్‌ను తెలంగాణకు అప్పగించాల్సివున్నప్పటికీ సిఆర్‌పిఎఫ్‌పోర్స్ ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు. సాగర్ ఆపరేషన్స్ బోర్డుతోపాటు ఏపి అధికారులే చేస్తున్నట్టు తెలిపారు. ప్రోటోకాల్స్ నిర్ణయం జరిగాకే ప్రాజెక్టులను అప్పగిస్తామని తిసభ్యకమిటి సమావేశంలో కూడా వెల్లడించామన్నారు.ముఖ్యమంత్రి ఆమోదం లేకుం డా వేటిని తాము అంగీకరించేదిలేదన్నారు. శ్రీశైలం , నాగార్జున సాగర్ ప్రాజెక్టుల పరిధిలో ఉన్న ఔట్‌లెట్స్ మాత్రం బోర్డు పర్యవేక్షణలో ఏ రాష్ట్ర పరిధిలోనివి ఆ రాష్ట్రమే నిర్వహిస్తుందని ఈఎన్‌సి మురళీధర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News