Monday, December 23, 2024

నన్నెవరూ కిడ్నాప్‌ చేయలేదు.. కెసిఆర్ ను కలిసేందుకు వచ్చా: ఆరూరి రమేశ్‌

- Advertisement -
- Advertisement -

తనను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని వర్ధన్నపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ చెప్పారు. జూబ్లీహిల్స్ నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి చేరుకుని ఆయనతో భేటి అయిన తర్వాత ఆరూరీ రమేష్ మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్  ఎన్నికల నేపథ్యంలో కెసిఆర్ ను కలిసేందుకు పార్టీ నేతలతో పాటు హైదరాబాద్‌ వచ్చానని ఆయన తెలిపారు. తాను బిజెపిలో చేరుతున్నానని వస్తున్నవార్తల్లో వాస్తవం లేదన్నారు. తానను అమిత్ షాను కలవలేదని.. ఎప్పటికీ బిఆర్ఎస్ లోనే ఉంటానని స్పష్టం చేశారు.

అంతకుముందు ఈరోజు ఉదయం ఆరూరి రమేశ్ ఇంటి వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. బిజేపీలో చేరేందుకు నిర్ణయించుకుని.. ప్రెస్ మీట్ పెట్టేందుకు ప్రయత్నించిన ఆరూరిని బిఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, ఎమ్మెల్సీ సారయ్య తమ కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఆరూరి అనుచరులు వారి కారుకు అడ్డంపడ్డారు. కొంతసేపు ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువైపులా పోటాపోటీ నినాదాలు కొనసాగాయి. చివరకు ఆరూరితో సహా ఎర్రబెల్లి, సారయ్య హైదరాబాద్ చేరుకుని కెసిఆర్ తో సమావేశమయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News