Thursday, January 23, 2025

మోడీతో చేతులు కలిపే ప్రసక్తి లేదు: ఎంఎన్‌ఎఫ్

- Advertisement -
- Advertisement -

ఐజావల్: వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రానికి వచ్చే ప్రధాని నరేంద్ర మోడీతో కలసి వేదికను పంచుకునే ప్రసక్తి లేదని మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగా ప్రకటించారు. మిజోరంలోని 40 అంసెబ్లీ స్థానాలకు నవంబర్ 7న పోలింగ్ జరగనున్నది.

బిజెపి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచార నిమిత్తం ప్రధాని మోడీ అక్టోబర్ 30న రాష్ట్రానికి రానున్నారు.
మిజోరంలో ఉన్న ప్రజలందరూ క్రైస్తవ మతానికి చెందినవారేనని, మణిపూర్‌లోని మైటీ ప్రజల ఇళ్లు, చర్చీలను తగలబెట్టినపుడు తమ రాష్ట్ర ప్రజలంతా దీన్ని వ్యతిరేకించారని మిజోరం ముఖ్యమంత్రి సోమవారం తెలిపారు. ఈ సమయంలో బిజెపి పట్ల సానుభూతి చూపిస్తు తమ పార్టీకి అత్యంత నష్టం చేకూరుతుందని మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్‌ఎఫ్) అధినేత జోరంతంగ తెలిపారు. ప్రధాని మోడీ ఒంటరిగా వచ్చి తాను మాత్రమే ప్రచారంలో పాల్గొంటే మంచిదని, తాను మాత్రం ఆయనతో కలసి వేదికను పంచుకునే ప్రసక్తి లేదని జోరంతంగ తెలిపారు.

బిజెపి నేతృత్వంలోని నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయన్స్(ఎవఇడిఎ)లో భాగస్వామ్య పక్షమైన ఎంఎన్‌ఎప్ కేంద్రంలో ఎన్‌డిఎకి మద్దతు ఇస్తోంది. అయితే మిజోరంలో మాత్రం ఆ పార్టీ బిజెపిని దూరం పెడుతోంది. తాము కాంగ్రెస్‌కు బద్ధ విరోధులమని, అందుకే కాంగ్రెస్ కూటమిలో కాకుండా బిజెపి నేతృత్వంలోని కూటమిలో ఉన్నామని ఆయన చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News