ఆయనకు ఏమైనా అయితే వదిలి పెట్టను!
పాట్నా: అవినీతి కేసులో సిబిఐ నేడు లాలూ ప్రసాద్ యాదవ్‌ను ప్రశ్నించింది. దాంతో చిర్రెత్తిపోయిన లాలూ కూతురు రోహిణి ఆచార్య ‘నిరంతరం వేధిస్తున్నారు. ఆయనకు ఏదైనా జరగకూడనిది జరిగితే మాత్రం ఎవ్వరైనా సరే వదిలిపెట్ట’ అని తీవ్రంగా హెచ్చరించింది. ఆమె లాలూ ప్రసాద్ రెండో కూతురు. ఆయన్ని వేధించడం మంచిది కాదు అని ఆమె హిందీలో ట్వీట్ చేసింది. ‘అన్నింటినీ గుర్తుంచుకుంటా. కాలం బలమైనది’ అన్నారు. మరో ట్వీట్‌లో ఆమె ‘74 ఏళ్ల ఆయనకి ఢిల్లీని గద్దెను కుదిపేసే శక్తి ఉంది’ అని హెచ్చరించారు. సింగపూర్‌లో ఆమె తన కిడ్నీని తండ్రికి ఇచ్చి కాపాడుకున్నారు. ఆయనకు సర్జరీ అయ్యాక పెద్ద కూతురు, పార్లమెంటు సభ్యురాలు మీసా భారతి ఇంట్లో ఉంటున్నారు.
భూమికి ఉద్యోగం అన్న కుంభకోణంలో లాలూ ప్రసాద్‌ను సిబిఐ ప్రశ్నించింది. ఆ కేసులో ఆయన భార్య రాబ్డీ దేవి, కూతుళ్లు మీసా భారతి, హేమ కూడా నిందితులుగా ఉన్నారు. ఆ కుంభకోణంలో ఉద్యోగాలు వచ్చిన 12 మంది పేర్లను కూడా సిబిఐ పేర్కొంది. కాగా లాలూ ప్రసాద్ యాదవ్ మీద వచ్చిన ఆరోపణలన్నింటినీ ఆర్‌జెడి కొట్టిపారేసింది. అదంతా రాజకీయ దురుద్దేశాలతో పెట్టినవేనంది. గత వారం రాబ్డీదేవి మట్లాడుతూ ‘లాలూ యాదవ్‌కు బిజెపి వణికిపోతోంది. మేమేమి పారిపోయే వాళ్లం కాము. గత 30 ఏళ్లుగా మేము ఆరోపణలను ఎదుర్కొంటున్నాం. బీహార్‌లో లాలూ అంటే బిజెపి వణుకు’ అన్నారు. సిబిఐ అధికారులు నిన్న పాట్నాలోని యాదవ్ ఇంట్లో రాబ్డీ దేవిని ప్రశ్నించారు. మార్చి 15న యాదవ్ కుటుంబ సభ్యులు, ఇతర నిందితులు ఈ కేసు విషయమై ఢిల్లీ కోర్టులో హాజరుకావలసి ఉంది.
पापा को लगातार परेशान किया जा रहा है। अगर उन्हें कुछ हुआ तो मैं किसी को नहीं छोड़ूंगी।
पापा को तंग कर रहे हैं यह ठीक बात नहीं है। यह सब याद रखा जाएगा। समय बलवान होता है, उसमें बड़ी ताकत होती है। यह याद रखना होगा।
— Rohini Acharya (@RohiniAcharya2) March 7, 2023