Wednesday, January 22, 2025

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపునకు కృషి

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపునకు కృషి చేస్తానని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక జర్నలిస్టులు ఇండ్ల స్థలాల కేటాయింపు కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అం దజేశారు.

జర్నలిస్టులు అందజేసిన వినతికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి త్వరలోనే ఇండ్ల స్థలాల కేటాయింపునకు అ ధికారులతో మాట్లాడి స్థలంకేటాయింపునకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపునకు కోసం ఇది వరకే సీఎంఓకు నివేదిక సమర్పించడం జరిగిందని ఎమ్మెల్యే చెప్పారు.

స్థానికంగా పని చేస్తున్న జర్నలిస్టులకు కనీసం బీఎల్‌ఓ కింద స్థలం కేటాయింపు జరపాలని కోరగా, జర్నలిస్టుల ఇండ్ల స్థలం కేటాయింపునకు తప్పకుండా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించిన వారిలో ముస్తాల రవి కిషోర్, రాజేందర్, లైశెట్టి రాజు, ఎర్రోజు వే ణుగోపాల్, నాగుల మల్యాల శివచారి, ముత్యాల కృష్ణమూర్తి, పోగుల విజయ్ కుమార్, కొల్లూరి గోపాల్, అర్కుటి మల్లేష్, తిర్రి శంకర్, శ్రీనివాస్ గౌడ్, ఆకుల రమేష్, రాజేందర్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News