Monday, December 23, 2024

రుక్మిణి పాండురంగ స్వామి ఆలయ అభివృద్ధికి కృషి

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్

చౌటకూర్: రుక్మిణి పాండురంగ స్వామి ఆలయ అభివృద్ధికి తనవంతుగా అభివృద్ధి చేసేందుకు శాయశక్తుల కృషి చేస్తానని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. చౌటకూర్ మండలం వెంకట కిస్టాపూర్ గ్రామంలోని అతి పురాతన రుక్మిణి పాండురంగ స్వామి ఆలయ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఆయన స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు.వేద పండితులు మంత్రోచ్ఛరణలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అతి పురాతన దేవాలయంగా పేరుగాంచిన పాండురంగ స్వామి ఆలయం ముందు గల కోనేరు శిధిలావస్థకు చేరిందని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా కోనేరు పరిశీలించారు.దేవాదాయ శాఖ ద్వారా ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించి కోనేరు పునరు నిర్మాణానికి పాటుపడతానన్నారు.

రుక్మిణి పాండురంగ స్వామి కలాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే అక్కడే కోలాటం ఆడుతున్న వారి వద్దకు వెళ్లి సరదాగా కొద్దిసేపు కోలాటం ఆడి అందరిని ఉత్సాహపరిచారు. అక్కడినుండి గ్రామంలో నూతన గృహ నిర్మాణం చేపట్టిన కార్యకర్త బేగరి విజయేందర్ ఇంటికి వెళ్లి తేనీటి విందును స్వీకరించారు. అనంతరం శివ్వంపేటలో అస్వస్థకు గురై కోలుకుంటున్న పంచాయతీ బిఆర్‌ఎస్ వార్డు సభ్యుడు బేకరీ అశోకుని పరామర్శించారు. పాండురంగ స్వామి ఉత్సవంలో గ్రామస్తులతో పాటు బిఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News