Monday, December 23, 2024

నియోజకవర్గ అభివృద్ధికి కృషి

- Advertisement -
- Advertisement -

రాజంపేట్ : ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధ్ది లక్షంగా అడుగులు ముందుకు వేస్తూ నిరంతరం తానంటు ఎదో చేయాలో అనే తపనతో పాటు అన్నా అంటే నేనున్నా అంటు బరోస కల్పిస్తూ నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తూ ముందుకు సాగుతున్నారు బిఆర్‌ఎస్ పార్టీ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట్ మండలం నల్లమడుగు గ్రామంలో జాజాల నర్సయ్యకు 1975లో జన్మించారు. 1995లో సర్దార్ పటేల్ కాలేజీలో ఉస్మానియ విశ్వవిద్యాలయంలో బి.కాం, పూర్తి చేశారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో అయన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు.
అనుకున్న లక్షం కోసం ముందుకు సాగుతూ…
2009, 2014లో ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి శాసనసభకు పోటి చేసి ఓటమి చూశారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గోని నేటి ఆర్థిక శాఖమంత్రి హరీష్‌రావుతో కలసి పని చేశారు. రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శిశ్యుడిగా రాజకీయంలో తనదైన శైలిలో ముందుకు సాగుతూ స్పీకర్ సలహాలు, సుచనలు పాటిస్తూ 2018లో కాంగ్రెస్ పార్టీ నుండి ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం ఎల్లారెడ్డి అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. నాటి నుండి ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రులు కేటిఆర్, హరీష్‌రావులతో సన్నిహితంగా ఉంటు అనుకున్నలక్షం కోసం నిరంతర శ్రామికుడిలా పని చేస్తున్నారు.
నియోజకవర్గ అభివృద్దికి నిరంతర కృషితో…
ఎల్లారెడ్డి అబివృద్ధ్ది కోసం. అనుకున్నదే లక్షంగా ఎల్లారెడ్డి రూపురేఖలు మార్చారు. ఎల్లారెడ్డి పట్టణంలో రోడ్డు వెడల్పు పనులు, రోడ్ల వెంటహైమాస్ లైట్లు, ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకలగా మార్చి అక్కడ నూతన భవనం నిర్మించి అటు మెదక్ ఇటు బాన్సువాడ అసుపత్రులకు వెళ్ళకుండా ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోని ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు సౌకర్యవంతంగా అసుపత్రిలో సౌకర్యాలు కల్పించారు, కిడ్ని రోగులకు డయాలసిస్ కేంద్రాన్ని ఎర్పాటు చేశారు. అలాగే శిథిలావస్థలో ఉన్న ఎల్లారెడ్డి బస్టాండ్‌ను నూతన బస్టాండ్ నిర్మాణం చేపడుతున్నారు.

ఎల్లారెడ్డి చెరువు కట్ట ఓకప్పుడు భయంకరంగాఉండేది అలాంటిది రోడ్డు వెడల్పు చేసి చెరువును మిని ట్యాంక్‌బాండ్‌గా మార్చారు పట్టణ ప్రజలకు తాగునీటి ఎద్దడి తీర్చారు. మెదక్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండల ప్రజల సౌకర్యార్థం తాండూర్ వద్ద మెదక్ జిల్లా పాపన్నపేట్ వెళ్ళడానికి బ్రిడ్జి నిర్మాణం చేపట్టి మండల ప్రజల మనుసు దోచుకున్నారు. గాంధారి మండల కేంద్రంలో రోడ్లు పరిస్థితులు గమనించి రోడ్డు వెడల్పు పనులు చేపట్టి రోడ్ల వెంటహైమాస్ లైట్లు పెట్టించి గాంధారికి నూతన కళ తీసుకోచ్చారు. లింగంపేట్ మండలంలోని ఆర్టీసి బస్టాండ్ నిర్మాణంతో పాటు నూతన గ్రామ పంచాయతీ భవనం, గ్రంథాలయ భవనం పనులు చేపట్టారు. రాజంపేట్ మండలంలో నడిమితాండ, ఎల్లాపూర్‌తాండ గ్రామాల సమీపంలో చెక్‌డ్యాం నిర్మాణాలు చేపట్టారు. మెదక్ కామారెడ్డి వెళ్ళే రోడ్డు మార్గంలో బ్రిడ్జిలు లేక వర్షాలకు ప్రయాణికులతో పాటు వాహనాదారులు, అయ గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందుల గుర్తించి కోండాపూర్, ఎల్లారెడ్డి పల్లి వద్ద నూతన బ్రిడ్జి నిర్మాణా పనులు చురుగ్గా కోనసాగుతున్నాయి.నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణాలు, మురికి కాలువలకు భారీగా నిధులు అందించి గ్రామాలను సస్యశామలం చేశారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News