Wednesday, January 22, 2025

మేదరుల సంక్షేమానికి కృషి

- Advertisement -
- Advertisement -

రాయికల్: తెలంగాణ ప్రభుత్వం మేదరుల సంక్షేమానికి చిత్తశుద్దితో పని చేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ తెలిపారు. రాయికల్ పట్టణంలోని మేదరుల సంఘ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం జరిగింది. సంఘ భవన ప్రా రం భించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు.

తెలంగాణ సిఎం కుల వృత్తుల అభివృద్ధికి అనేక రకాలుగా సహకారం అందిస్తున్నారని చెప్పారు. ఇదే కోవలో తాజాగా బిసి కులాలకు రూ.1లక్ష సాయం ప్రకటించారని గుర్తు చేసారు. మేదరులు ఐక్యతతో ఉండి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. రాయికల్ మేదరుల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామి ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్శన్ గండ్ర రమాదేవి, కౌన్సిలర్ ఏలిగేటి లతిక అనిల్, మేదరి సంఘం జిల్లా అ ధ్యక్షులు ఇందూరి గంగాధర్, ప్రధాన కార్యదర్శి పేర్ల రాజేశం, రాయికల్ మండలశాఖ అధ్యక్షులు సిలువేరి సురేష్, పట్టణ అ ధ్యక్షులు ఊరేడి లక్ష్మినర్సయ్య, నాయకులు గంగాధర్, చిన్న రాజం, మల్లయ్య, ఇందూరి రాజు, గంగారాం, రమేష్, సాగర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News