Monday, December 23, 2024

ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కృషి

- Advertisement -
- Advertisement -

గోదావరిఖని: ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం గోదావరిఖని పట్టణంలోని తిలక్ నగర్ విశ్వం కమ్యూనిటీ హాల్‌లో రామగుండం కార్పొరేషన్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళలు గౌసియా, శమీమ్ సాలెహా, అఫ్రీన్, మహ్మదా, మైనునా రహమత్, బిల్కిస్ నైమా, జాకీయా, సుజాతా, మానస, ఆఫ్సారి, సఫియా రిజ్వానా, భద్రునా

ఆకెనలపల్లి గ్రామానికి చెందిన ముదిరాజ్ కులస్తుల సంఘం నాయకులు ఆయుల వేని సంతోష్, రాయుళ్ల సాగర్, జిట్టవేన లక్ష్మణ్, ఉత్తెం పోశయ్య, ఎంఐఎం కార్పొరేషన్ అధ్యక్షుడు హజ్ అలీ, దినబంధు స్వచ్ఛంద సంఘ బాధ్యుడు పాషా, ఎన్టీపీసీ మజీద్ కమిటీ మత పెద్ద సైఫుల్లాఖాన్‌తోపాటు 500 మంది బిఆర్‌ఎస్ పార్టీలో ఎమ్మెల్యే సమక్షంలో చేరగా, వారికి గులాబీ కండువాలు కప్పి, పార్టీలోకి ఎమ్మెల్యే ఆమ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పేదవాడి సంక్షేమంపై సిఎం కెసిఆర్ ప్రత్యేక దృష్టి సారించి, ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసి పేదవారికి అండగా నిలుస్తున్నారని అన్నారు. తొమ్మిదేళ్ల సిఎం కెసిఆర్ పాలన దేశానికి ఆదర్శంగానిలుస్తుందని, సకల వర్గాల కోసం అహర్నిషలు కృషి చేస్తున్న సిఎం కెసిఆర్ రుణం ఓటు వేసి తీర్చుకోవాలని, మూడవ సారి హాట్రలిక్ సిఎంగా కెసిఆర్‌ను తిరిగి ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.

తనపై అసత్యపు ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కుట్రలను తిప్పి కొట్టాలని అన్నారు. కార్యక్రమంలో అంతర్గాం జడ్పిటిసి ఆముల నారాయణ, కార్పొరేటర్ ఇంజపురి పులేందర్, దాతు శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యులు తస్నీం భాను రఫీక్, సర్పంచ్‌లు ధరణి రాజేష్, మెరుగు పోశం, ఎంపిటిసి మస్కం శ్రీనివాస్, మండల కో ఆప్షన్ సభ్యులు గౌస్ ఫాషా, నాయకులు, కార్యకర్తలున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News