Tuesday, December 3, 2024

మహిళా సాధికారతకు కృషి

- Advertisement -
- Advertisement -

రామగుండం కార్పొరేషన్: మహిళల అభివృద్ధికి, సంక్షేమానికి స్వశక్తి మహిళా పొదుపు సంఘాలు ఎంతగానో సహకరిస్తాయని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన మహిళా కమిటీని ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గతంలో స్వశక్తి సంఘం మహిళలు రుణాలు తీసుకుంటూ తిరిగి చెల్లించే విధంగా ఉండేవారని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత వారి ఉపాధి, అభివృద్ధి కోసం, వ్యక్తిగతంగా, ప్రభుత్వంగా సహాయ, సహాకారాలు అందసిఉ్తన్నానని అన్నారు.

నూతన కమిటీ బాధ్యులు కింది స్థాయి సభ్యులచే, మహిళలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్ రావు, మెప్మా బాధ్యులు రజనీ, అధికారులు శ్రీనివాస్, సురేందర్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News