Monday, December 23, 2024

సమన్వయంతో లక్ష్యం చేరుకునేలా పనిచేయాలి

- Advertisement -
- Advertisement -

నల్గొండ: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి తెలంగాణకు హరిత హరం కార్యక్రమం లో మొ క్కలు నాటే లక్ష్యం చేరుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ టి .వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టర్ తన క్యాంపు కా ర్యాలయం నుండి ఎంపీడీవోలు, ఎం.పీ.ఓ లు, ఏ.పి.ఓ లతో హరితహారం, సంపద వనాలు, ప్రకృతి వనాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణా లు, ఇంటింటికి మొక్కలు పంపిణీ,నాటుట మొదలగు అంశాల పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంటింటికి మొక్కల పంపిణీ నాటించే కార్యక్రమము వారం రోజులలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గుర్తించిన స్థలాలలో మొక్కలు నాటడానికి మండల స్థాయి అ ధికారులు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. ఎంపీడీవోల వద్ద ఫా రెస్ట్, మున్సిపాలిటీల మొక్కల లక్ష్యం తప్ప మిగతా అన్ని ప్రాంతాలలో మొక్కలు నాటడానికి అవసరమైన అన్ని రకాల నివేదికలు, రి పోర్టులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.

ప్రతి గ్రామపంచాయతీలలో డైలీ రిపోర్టులు, ఇంకుడు గుంతలు, మొక్కలు, చెల్లింపులు ఒకే రక ంగా ఉండాలన్నారు. ఎక్కడ పొరపాట్లకు తావివ్వరాదని సూచించారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలు, పల్లె ప్రకృతి వనాలలో ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటించాలని అధికారులను కోరారు. వివిధ ప్రభుత్వ శాఖలకు లక్ష్యంగా కేటాయించిన వివరాలను ఎంపిడిఓ లు ఇతర శాఖల అధికారులతో కలిసి సమీక్షించుకొ ని క్షేత్రస్థాయిలో జరుగుతున్న అన్ని రకాల పనులకు సంబంధించిన రిపోర్టులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కు పంపించాలని అధికారులను ఆయన ఆదేశించారు.

క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల సమగ్ర వివరాలను స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుండి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుష్బు గుప్తా, జిల్లా పరిషత్ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, డి.అర్.డి. ఓ కాలిందిని, డిపిఓ విష్ణువర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News