Friday, November 22, 2024

శరవేగంగా సీతారామ

- Advertisement -
- Advertisement -

Work on Sitarama project is in full swing

త్వరలో ఉమ్మడి
జిల్లాల
ఎంఎల్‌ఎలతో
సమావేశం
కేంద్ర గెజిట్
నోటిఫికేషన్‌తో
రానున్న
జల సంక్షోభం
రాష్ట్ర హక్కులను
కాలరాస్తే
చూస్తూ ఊరుకోం
మంత్రి
పువ్వాడ అజయ్

మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి : ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామా ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని, నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని బుధవారం నాడు మంత్రి పేర్కొన్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు మహబుబ్‌బాద్ జిల్లాలో మొత్తం 6,74,387 ఎకరాలకు పుష్కలంగా సాగునీరు అందిస్తామన్నారు. అంతేగాక సత్తుపల్లి, వైరా, మధిర సెగ్మెంట్లో నాగార్జునసాగర్ చివరి ఆయకట్టు రైతులకు సాగు నీరు కొరత రాకుండా సీతారామా ప్రాజెక్టు ద్వారా కృష్ణా నీటికి బదులు సాగర్ కాలువల్లో గోదావరి నీళ్లను పారించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నామన్నారు. కృష్ణా నదిలో మన హక్కును కోల్పొయే ప్రసక్తేలేదని, దాన్ని పరిరక్షించేంచుకునే చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సూచన మేరకు త్వరలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చిస్తామన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తొమ్మిది ప్రాజెక్టుల నిర్మాణ చేపట్టితే వాటిలో దాదాపు నాలుగు ప్రాజెక్టులు పూర్తికావొచ్చాయని ఈ ప్రాజెక్టుల ద్వారా 36లక్షల 53వేల ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వస్తుందన్నారు. రూ.70వేల కోట్లతో ఈ ప్రాజెక్టులు నిర్మాణం అవుతున్నాయని ఇప్పటికే 37వేల కోట్ల నిధులను వెచ్చించడం జరిగిందన్నారు. అయితే కృష్ణా, గోదావరి నదులను తమ పరిధిలోకి తీసుకుంటూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌తో జల సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ సమాఖ్య స్ఫూర్తి వ్యవస్థకు, రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. నదుల అనుసందనం పేరుతో రాష్ట్ర సమ్మతి లేకుండా చుక్కనీరు కూడా తీసుకువెళ్లే హక్కు కేంద్రానికి లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీ వేధికగా స్పష్టం చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్రం గెజిట్ అదేశాలను పాటిస్తే తెలంగాణలో ఎక్కడి ప్రాజెక్టులు అక్కడ నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే 9 ప్రాజెక్టులను నిర్మిస్తున్న సమయంలో కేంద్రం ఈ ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూస్తూ జలక్రమణకు పాల్పుడుతందన్నారు. రాష్ట్ర హక్కుకు విరుద్ధంగా వ్యవహరిస్తే సుఫ్రింకోర్టును ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. చట్టవిరుద్ధం వెళ్తూ రాష్ట్రాల స్వయంప్రతిపత్తి హక్కును హరిస్తుందని మంత్రి బిజెపి వైఖరిపై మండిపడ్డారు.బిజెపినేతల తీరును చూస్తే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దె చందంగా ఉందని ఆయన ఎద్దెవా చేశారు. బిజెపి నాయకులకు దమ్ము ఉంటే తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయహోదా నీటి హక్కుల కోసం కేంద్రాన్ని నిలదీయాలని బిజెపి నేతలకు మంత్రి సవాల్ విసిరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News