Wednesday, January 22, 2025

పనుల్లో వేగం పెంచాలి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట:కలెక్టరేట్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ సంబంధిత అధికారులకు తె లిపారు. శనివారం నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయ పనులను పరిశీలించారు. సమీకృత సముదాయం ఆవరణలో మొక్కలను, శాఖల వారీగా కేటాయించిన గదులను కలెక్టర్ పరిశీలించారు. పనులు వేగం పె ంచాలని ఆగస్టు మొదటి వారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఉన్నందున అన్ని పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో మొదటి సారిగా సో లార్ సిస్టంతో ప్రారంభానికి సి ద్ధమవుతున్న సమీకృత కలెక్టరేట్ సూ ర్యాపేట జిల్లా ఒకటే అని కలెక్టర్ తెలిపారు. మొదటి అంతస్తులోని మీటి ంగ్ హాలు, గదులను పరిశీ లించి పై అంతస్తులో జరుగుతున్న సోలార్ పనులను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టరేట్ ఆవరణలో జరుగుతున్న రోడ్ల పనులకు త్వ రగా పూర్తి చేయాలని గుత్తేదా రులకు తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్ అండ్ బి ఎస్సీ నర సింహనాయక్, ఈఈ యా కూబ్, డివైఈ పవన్ అధికా రులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News