Friday, November 22, 2024

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

- Advertisement -
- Advertisement -

ఆసిఫాబాద్: ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్‌రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో గల కలెక్టర్ చాంబర్‌లో అర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. సిర్పూర్ టి మండలం లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన తాళ్లపల్లి పత్రు తనకు తన తాతలకు సంబంధించిన భూమి గ్రామ పంచుల సమక్షంలో తండ్రి ద్వారా సంక్రమించిన భూమిపట్ట పాసుపుస్తకంలో నమోదు కాలేదని, ఈ విషయమై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.

కౌటాల మండలం గుండాయిపేట గ్రామానికి చెందిన దుర్గం కాసుబాయి తన తండ్రి నుండి తనకు రావాల్సిన వాటాను తనకు తెలియకుండా సోదరులు రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఈ ప్రక్రియను నిలుపుదల చేయాలని కొరుతూ అర్జీ సమర్పించారు. కాగజ్‌నగర్ పట్టణం ఇంద్రమార్కెట్ ప్రాంతానికి చెందిన షాగుప్తనాజ్ తాను కాగజ్‌నగర్ పట్టణం 25వ వార్డులో ఖాళీగా ఉన్న మీ సేవ కోసం నిర్వహించిన పరీక్షకు హాజరై అర్హత పొందానని, తనకు మీ సేవ ప్రాంచైజ్ కేటాయించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.

కెరమెరి మండలం కరంజీవాడ గ్రామానికి చెందిన రాథోడ్ సావిత్రబాయి నిరుపేద అయిన తనకు రెండు పడక గదుల ఇండ్ల పథకంలో అవకాశం కల్పించాలని కొరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పరిష్కారించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల ఆధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News