Saturday, November 23, 2024

క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి కృషి

- Advertisement -
- Advertisement -

ధర్మారం: క్రిస్టియన్ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, చర్చిల అభివృద్ధికి నిధులు కేటాయించి సమున్నతంగా తీర్చిదిద్దుతున్మాని, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మపురి నియోజవర్గ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ధర్మారంలోని మెగ్గిద్దో ప్రార్థన మందిరంలో నిర్వహించిన దైవ సేవకుల సదస్సుకు మంత్రి ఈశ్వర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం హైదరాబాద్‌లో 62 ఎకరాల స్థలాన్ని క్రిస్టియన్‌ల కోసం కేటాయించాలని నిర్ణయించి ఇప్పటికే ఐదు జిల్లాలో పరిధిలో 42 ఎకరాల స్థలాన్ని ఇవ్వడం జరిగిందన్నా. పట్టణ శాఖ ద్వారా మంత్రి కేటీఆర్ రూ.10 కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు.

క్రిస్టియన్ భవన నిర్మాణం కొరకు రెండు ఎకరాల భూమితోపాటు రూ.10 కోట్లు మంజూరు చేశామని, ఇది ఏ రాష్ట్రంలో సాధ్యం కాదని మంత్రి అన్నారు. ప్రతి సంవత్సరం క్రిస్టియన్ పండుగను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తూ కానుకలు అందిస్తుందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా క్రిస్టియన్ మైనారిటీలను ప్రేమానుబంధాలతో చూసుకుంటూ పూర్తి స్తాయి భద్రత కల్పిస్తున్నామని మంత్రి అన్నారు. క్రిస్టియన్‌ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, సీఎం కేసీఆర్ పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించేందుకు ముందు చూపుతో ఉన్నారని గుర్తు చేశారు.

ధర్మపురి నియోజకవర్గగంలోని చర్చిల అభివృద్ధికి, క్రిస్టియన్‌ల సమస్యల పరిష్కారానికి ఎంతో ప్రాధాన్యమిచ్చి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తానని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, జిల్లా రైతుబందు సభ్యులు పూసుకూరు రామారావు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాచూరు శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు బాస తిరుపతిరావు, టీయూసీపీఏ రాష్ట్ర అధ్యక్షుడు తీమోథి, కార్యదర్శి సొలమోన్ రాజు, ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జి యోహాన్, ధర్మారం ఫాస్టర్ జాన్‌వెల్సన్‌తోపాటు నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల పాస్టర్లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News