Friday, November 22, 2024

కంటి వెలుగు -2 ను విజయవంతం చేద్దాం : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రత్యేక శ్రద్ద తీసుకోని పెట్టిన కంటి వెలుగు కార్యక్రమం కోసం అందరూ కష్టపడాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణలో అంధత్వ నివారణ లక్ష్యంగా చేపట్టిన కంటి వెలుగు – 2 కార్యక్రమంలో భాగంగా వరంగల్, హనుమకొండ జిల్లాల సన్నద్ధత సమావేశం మంత్రిఎర్రబెల్లి దయాకర్ రావు అధ్యక్షతన హనుమకొండ కలెక్టరు కార్యాలయంలో ప్రారంభించారు. మొదటి విడత లో జరిగిన ఈ కార్యక్రమం విజయవంతం అయ్యిందని, ప్రజల నుండి బాగా స్పందన వచ్చిందని తెలిపారు.

దేశం లో ఏ రాష్ట్రం ఇలాంటి కార్యక్రమం చేపట్ట లేదని, మన ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక శ్రద్ద తీసుకోని ప్రజల ఆరోగ్యం కోసం ఇటీవల డాక్టర్ లను కూడా నియమించారని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం అయ్యి ప్రతీ క్యాంపు లో పాల్గొనాలని కోరారు. ఎంపిపి లు 18 వ తేదీ లోపు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని సర్పంచ్ లతో కో ఆర్డినేట్ చేసుకోవాలని, క్యాంపు లో కావలిసిన మౌలిక వసతుల ను చూసుకోవాలని సూచించారు. భోజనాలు కూడా పెట్టించాలని తెలిపారు. గ్రామ పంచాయతీ దగ్గర కంటి వెలుగు కార్యక్రమం మీద అవగాహన కోసం బోర్డు పెట్టాలని, పబ్లిసిటీ బాగా చేయాలని, ప్రతి మున్సిపాలిటీ లో కార్పొరేటర్ లను, వార్డ్ మెంబర్ లను భాగస్వామ్యం చేసి కార్యక్రమన్ని విజయవంతం అయ్యేలా చూడాలని కోరారు.

ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక శ్రద్ద పెట్టి అవసరమైన ప్రతి ఒక్కరికి కంటి పరీక్ష జరిగేలా చూడాలని వివరించారు. నిర్ధిష్ట టైంకి ప్రతీ క్యాంపు లో టీం సభ్యులు అందుబాటులో ఉండాలని, టీం వర్క్ గా జరగాలని, వంద రోజులు జరిగే ఈ కార్యక్రమం లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనాలని, వేరే కార్యక్రమాలు పెట్టుకోకుండా కంటి వెలుగు కార్యక్రమం లో ప్రతీ రోజు పాల్గొనాలని ఆదేశించారు. దీన్ని అందరూ ఉపయోగించుకునేలా చుడాలని , అన్ని గ్రామాల లకు అందరూ వెళ్ళాలని తెలిపారు.

శనివారం, ఆదివారం తప్ప వారంలో అన్ని రోజుల్లో క్యాంప్స్ ఉంటాయని. ఎక్కడి వారు అక్కడే బస చేసి టీమ్ వర్క్ గా కృషి చేయాలని తెలిపారు.. పని చేసే వారికి 1500 రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. ఇది ఫెయిల్ అయితే ప్రజా ప్రతినిధులు, అధికారులు ఫెయిల్ అయినట్లే అని, కాబట్టి ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమమని తెలిపారు. కంటి అద్దాలు కావల్సిన వాళ్లకు అందించాలని సూచించారు. ఎంపిపిలు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని కార్యక్రమం మీద ప్రజలకు అవగాహనా కల్పించాలని తెలిపారు.

సమావేశానికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గుండు సుధారాణి, ఎంపీ పసునూరి దయాకర్, హనుమకొండ జిల్లా జెడ్పీ సుధీర్ కుమార్, వరంగల్ జిల్లా జెడ్పీ శ్రీమతి గండ్ర జ్యోతి, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ , ఎమ్మెల్సి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, నన్నపనేని నరేందర్, వొడితెల సతీష్, రుణ విమోచనా కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, నర్సంపేట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, ఎన్.గోపి, జిల్లాల అధికారులు, మున్సిపల్ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News