Thursday, January 23, 2025

అంకితభావంతో పని చేసి పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ అనేది సర్వసాధారణమని, ఎక్కడ విధులు నిర్వహించినా అంకితభావంతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా ఎస్‌పి ఎగ్గడి భాస్కర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన బదిలీల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు బదిలీపై వెళ్తున్న రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ వామనమూర్తిని జిల్లా ఎస్‌పి ఆదివారం శాలువాతో సత్కరించి ఆత్మీయ వీడ్కోలు పలికారు.

ఈ సందర్బంగా ఎస్‌పి మాట్లాడుతూ, కాలానుగుణంగా సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నాయని, సమయం, సందర్భాన్ని బట్టి విధులు నిర్వర్తించాలని, విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని వామనమూర్తికి సూచించారు. బదిలీపై వెళ్తున్న ఆర్‌ఐ వామనమూర్తి మాట్లాడుతూ, జిల్లాలో 47 నెలల పాటు విధులు నిర్వర్తించానని, పోలీస్ అధికారులు, సిబ్బంది సహకారం మరువలేనిదని అన్నారు. ఇక్కడ విధులు నిర్వర్తించడం ఎంతో సంతృప్తినిచ్చిందని, సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌పి రాజశేఖర్‌రాజు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News