Monday, December 23, 2024

క్వారీలో బండరాయి మీద పడి దినసరి కూలీ మృతి

- Advertisement -
- Advertisement -

వరంగల్ : విధుల్లో యాజమాన్యం నిర్లక్షంగా వ్యవహరించడంతో ఓ దినసరి కూలీ దుర్మరణం పాలయ్యాడు. కేసముద్రం ఎస్సై దుర్ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఎస్సై కథనం ప్రకారం అర్పనపల్లి మిడ్‌వెస్ట్ గ్రానైట్స్ లిమిటెడ్ క్వారీలో అదే గ్రామానికి చెందిన మృతుడు షేక్ అమీర్ పాషా (55) దినసరి కూలీగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం క్వారీలో నైట్ డ్యూటీకి వెళ్లాడు.

విధుల్లో భాగంగా ఉదయం క్వారీలో డ్రిల్లింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ముప్పై మీటర్ల ఎత్తు నుండి డ్రిల్లింగ్ చేస్తున్న రాయి మృతుడిపై పడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. బండరాయి మీద పడి మాంసం ముద్దగా మారిన మృతుడిని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మృతుడి కుమారుడు షేక్ జానీ పాషా ఫిర్యాదు మేరకు తగు జాగ్రత్తలు తీసుకోకుండా విధుల్లో నిర్లక్షం వహించిన క్వారీ సూపర్‌వైజర్ కోటిపల్లి విజయభాస్కర్, క్వారీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News