Wednesday, January 22, 2025

మిషన్ భగీరథ ట్యాంక్ శుభ్రం చేస్తూ కార్మికుడు మృతి

- Advertisement -
- Advertisement -

Worker dies while cleaning Mission Bhagiratha tank

ఖమ్మం: జిల్లాలోని నయాబజార్ లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ శుభ్రం చేస్తూ కార్మికుడు మృతిచెందాడు. ట్యాంక్ ను శుభ్రం చేసేందుకు ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు లోపలికి దిగారు. నీటి ట్యాంక్ శుభ్రం చేస్తూ కార్మికుడు పైప్ లోకి జారిపడిపోయాడు. పైపులైన్ లో ఊపిరిఆడక ప్రాణాలు కోల్పోయాడు. తోటి కార్మికులు పైపులైన్ నుంచి కార్మికుడి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కార్మిక సంఘాలు ధర్నాకు దిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News