Monday, December 23, 2024

నాగపూర్ ఫ్యాక్టరీలో పేలుడుకు ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

నాగపూర్ : నాగపూర్‌లోని ఎకనామిక్ ఎక్స్‌ప్లోజివ్స్ ఫ్యాక్టరీలో శనివారం ఉదయం పేలుడు సంభవించి తీవ్రగాయాలు పాలైన ఇద్దరిలో ఒకరు మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉదయం 7. 30 గంటల ప్రాంతంలో శివసావంగలో ఈ ఫ్యాక్టరీ ప్లాంట్ లో వ్యర్థాలను దహనం చేస్తుండగా పేలుడు సంభవించింది. మృతుడు 21 ఏళ్ల ప్రతీక్ ఖడాట్కర్‌గా గుర్తించినట్టు ఎస్‌పి విశాల్ ఆనంద్ తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీస్‌లు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News