- Advertisement -
యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని థర్మల్ ప్లాంట్ లో ఓ కార్మికుడు దారుణ హత్యకు గురయ్యాడు. దామరచర్ల మండలం వీర్లపాలెంలోని పవర్ ప్లాంట్ లో ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పవర్ మేక్ వద్ద కార్మికుడిని తోటి కార్మికుడు గొంతు కోసి ప్రాణాలు తీశాడు. మృతుడు అసోం రాష్ట్రానికి చెందిన రుతు(46)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న వాడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
- Advertisement -