Wednesday, January 22, 2025

రైతువేదికలో ఉపాధి హామీ కూలీల రభస

- Advertisement -
- Advertisement -

మోస్రా రైతువేదికలో ఉపాధి హామీ కూలీల రభస

మోస్రా: నిజామాబాద్ జిల్లా మోస్రా మండల కేంద్రంలో మంగళవారం రైతు వేదికలో ఉపాధి కూలీలు రభస చేసినట్లు తెలుస్తోంది. తాము ప్రతిరోజు ఉపాధి హామీ కూలీకి వెళ్తున్న తమ ఖాతాలో డబ్బులు జమ కావడం లేదని హామీ కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. మోస్రా మండలంలోని రైతు వేదికలో జరిగిన సమావేశంలో 50 నుండి 60 మంది ఉపాధి హామీ కూలీలు హాజరై మాట్లాడుతూ ఎండలు ముదురుతున్న తరుణంలో భూమి దరి గట్టిగా ఉండడంతో లోతుగా తీయలేకపోతున్నామని ఉపాధి కూలీలు తెలిపారు. ఏపివో సురేష్‌ను వివరణ అడగగా ఉపాధి కూలీలకు కొలతల ప్రకారం డబ్బులు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటిసి గుత్పవిజయ భాస్కర్ రెడ్డి, మండల రైతు సమన్వయ కో ఆర్డినేటర్ పిట్ల శ్రీరాములు, తహసీల్దార్ సాయిలు, ఎంపిడివో భారతి, ఎంపిడివో సిబ్బంది, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News