Monday, December 23, 2024

కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాలోని జలగం నగర్‌లో గల మండల పరిషత్ కార్యాలయం ఎదుట కార్మికులు నిర్వహిస్తున్న ఐదో రోజు సమ్మెకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పంచాయతీ కార్మికులు కోరేది గొంతెమ్మ కోరికలు ఏమి కాదని ప్రభుత్వం పరిష్కరించదగినవే అన్నారు. తక్షణమే చొరవ తీసుకొని విరమింప చేసేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కరోనా విపత్కర సమయంలో కార్మికులు పడ్డ కష్టం మాటల్లో వర్ణించరానిదని గుర్తు చేశారు.

గ్రామాలను అద్దంలా తీర్చిదిద్ది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతుంటే ప్రభుత్వం వివక్ష చూపడం సరికాదన్నారు. పనికి తగిన వేతనం ఇవ్వకుండా బండెడు కష్టాన్ని కార్మికులతో చేపించుకోవడం కార్మిక చట్టాలను ఉల్లంఘించడమేనన్నారు. ఆరో రోజు నిరవధికంగా సమ్మె కొనసాగుతున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా ఉండకపోవడం దురదృష్టకరమన్నారు. సమస్యలను పరిష్కరించకుంటే సిపిఐ పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు చెరుకుపల్లి భాస్కర్, మండల కార్యదర్శి పుచ్చకాయల సుధాకర్, సర్పంచ్ బండి ఉపేందర్, మండల సమితి సభ్యులు దండి రంగారావు, బట్టబాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News