Thursday, January 23, 2025

కూలిన సొరంగంలో గాలి, నీరు క్రమేపీ విషపూరితం

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లోని సిల్క్‌యారా టన్నెల్‌లో చిక్కుపడ్డ 41 మంది కూలీల పరిస్థితి క్రమేపీ ఆందోళనకరంగా మారుతోంది. వీరిని వెలికితీసేందుకు పెద్ద ఎత్తున జాతీయ విపత్తు నిర్వహణ దళం రంగంలోకి దిగింది. లోపలికి వారికి కావల్సిన ఆహారం, మందులు, ఆక్సిజన్ అందిస్తూ వస్తున్నారు . అయితే సోమవారానికి కూలీలు లోపల చిక్కుపడి 8 రోజులు దాటింది. లోపలి గాలి, అందుబాటులో ఉన్న నీరు క్రమేపీ కలుషితం అవుతూ వస్తోంది సాధారణంగా సొరంగ నిర్మాణ పనులకు , డ్రిల్లింగ్‌లకు వాడే రసాయనికాలు ఎక్కువగా ఈ పరిమిత గాలిలో చేరితే ఇక కూలీలు పీల్చుకునే గాలి, ఇదే క్రమంలో అక్కడి నీరు కూడా విషపూరితం అవుతుందని , ఇది వారికి ప్రాణాంతకం కావచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓ వైపు లోపలి వారిని భద్రంగా బయటకు తీసుకువచ్చేందుకు వారి ప్రాణాలను నిలిపేందుకు వెలుపల ఉన్న సహాయక సిబ్బంది అవిశ్రాంతంగా పాటుపడుతూ వస్తున్నా, మరో వైపు నిమిషాలు దాటుతున్న కొద్దీ లోపలి వాతావరణం కలుషితం అయితే ఇది పూర్తిగా రసాయనిక భరితం ,

వికటించి విషపూరితం అయితే కూలీలు ఇక గ్యాస్‌ఛాంబర్ పరిస్థితిని ఎదుర్కొంటారనే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే గాలి విషపూరితం కాకుండా స్వచ్ఛంగా ఉండేందుకు సరైన ఆక్సిజన్ డంప్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కానీ లోపలి భారీ స్థాయి ప్రమాదకర రసాయనాలు , గాలి ప్రసరణకు సరైన వీలు లేకపోవడం కూలీలకు ముప్పుగా మారుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టన్నెల్‌లోని కూలీలను రక్షించేందుకు దీనికి మూలమైన భారీ పర్వతం పై భాగంలో టన్నెల్‌కు సమాంతరంగా పొడవుగా మరో దారిని తొలిచి ఈ ద్వారం గుండా కూలీల వద్దకు చేరాలని నిర్ణయించారు. ఈ దారి కూడా ఏర్పాటు అయినట్లు అధికారులు తెలిపారు. కానీ దీని గుండా కూలీలను వెలికితీసే చర్యల గురించి స్పష్టత రాలేదు. ఇప్పటికీ లోపల చిక్కుపడ్డ కూలీల పేర్లు లేదా వారి రాష్ట్రాల వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. బీహార్‌కు చెందిన కూలీలే ఎక్కువగా ఇక్కడ ఉన్నట్లు రోజువారి ప్రకటనల క్రమంలో అధికారవర్గాలు ఓ దశలో ప్రకటించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News