Sunday, December 22, 2024

ఇసుక రీచులో చిక్కుకున్న వర్కర్స్.. ఒకరి గల్లంతు

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని మానేరు పరివాహక ప్రాంతంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. మంథని మండలం గోపాలపూర్ ఇసుక రీచులో 15 మంది చిక్కుకున్నారు. ఇసుక రీచు చుట్టూ నీరు వచ్చి చేరడంతో అక్కడ ఉన్న జేబీని ఆశ్రయించిన రీచ్ వర్కర్స్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. కుండపోతగా కురుస్తున్న వర్షంలో తడుస్తూ సహాయం అందించే వారి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే వీరిలో ఒకరు మానేరు వాగులో గల్లంతయినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఓ కంటైనర్, జేసీబీలు కూడా వరద ఉధృతికి కొట్టుకపోయినట్టు సమాచారం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News